హోమ్ /వార్తలు /తెలంగాణ /

Monsoon session: 18 నుంచి ఢిల్లీలో దబిడి దిబిడే -బీజేపీకి చుక్కలు చూపించేలా KCR ప్లాన్

Monsoon session: 18 నుంచి ఢిల్లీలో దబిడి దిబిడే -బీజేపీకి చుక్కలు చూపించేలా KCR ప్లాన్

కేసీఆర్, మోదీ (ఫైల్ ఫొటోలు)

కేసీఆర్, మోదీ (ఫైల్ ఫొటోలు)

కేంద్రంపై, ప్రధాని మోదీపై యుద్ధం చేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక పోరును మరింత ఉధృతం చేయనున్నారు. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వేదికగా చేసుకోనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ దేశవ్యాప్త ఉద్యమం లేవనెత్తనుంది..

బీజేపీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో కేంద్రంపై, ప్రధాని మోదీపై యుద్ధం చేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఇక పోరును మరింత ఉధృతం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై కేసీఆర్‌ సమర శంఖం పూరించనున్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్న కేంద్రం వైఖరిని తేటతెల్లం చేయాలని నిర్ణయించారు. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon session 2022) వేదికగా చేసుకోనున్నారు. అంతేకాదు, బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక దమన నీతిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు.

బీజేపీపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో శుక్రవారం ఫోన్లో మరోసారి సీఎం కేసీఆర్‌ మంతనాలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ యాదవ్‌, ఇతర జాతీయ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆస్పత్రిలో ఉన్నందున ఆయన సన్నిహితులతో మాట్లాడారు.

TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!


కేంద్రంపై పోరుకు కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనలకు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు ప్రగతి భవన్‌ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా ఈ చర్చలు సాగుతున్నాయని అందులో తెలిపారు. పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ దమన నీతిపై పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్త నిరసనలతో కేంద్ర ప్రభుత్వ అసలు స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు కేసీఆర్‌ సన్నద్ధమవుతున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

CM KCR| CNOS Survey : అసంతృప్తి ఉన్నా కేసీఆర్‌కు తగ్గని ప్రజాదరణ.. జాతీయ సర్వేలో 11వ ర్యాంక్


నేడు ఎంపీలకు దిశానిర్దేశం: ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు విధానాలను ఎండగట్టాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. పార్లమెంటు వేదికగా కేంద్రంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది.

India Population : అత్యధిక జనాభా గల దేశంగా భారత్.. కొద్ది రోజుల్లోనే చైనాను దాటేస్తున్నాం..


తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాలు, ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ పిలుపు ఇవ్వనున్నట్లు వెల్లడైంది. ఉపాధి హామీ పథకం అమల్లో ద్వంద్వ వైఖరిని నిలదీయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రూపాయి పతనంతోపాటు ఆర్థిక రంగంలో కేంద్రం అసంబద్ధ విధానాలపై పార్లమెంటులో నిలదీయాలని నిర్ణయించినట్లు ప్రగతి భవన్ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ తో కలిసి వచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కలుపుకొని పోవాలని నిర్ణయించారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Monsoon session Parliament, Parliament, Telangana, Trs

ఉత్తమ కథలు