హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big News: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఏం చెప్పబోతున్నారు?

Big News: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఏం చెప్పబోతున్నారు?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఓ వైపు ఈడీ, మరోవైపు ఐటీ దాడుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా నేతలు ఎవరూ భయపడవద్దని అప్రమతంగా ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తుంది. మరి ఈ భేటీలో కేసీఆర్ క్యాడర్ కు ఎలాంటి సందేశం ఇస్తారో చూడాలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఓ వైపు ఈడీ, మరోవైపు ఐటీ దాడుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా నేతలు ఎవరూ భయపడవద్దని అప్రమతంగా ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తుంది. మరి ఈ భేటీలో కేసీఆర్ క్యాడర్ కు ఎలాంటి సందేశం ఇస్తారో చూడాలి.

Breaking News: తెలంగాణ కాంగ్రెస్ కు కీలక నేత రాజీనామా..పోతూ పోతూ సంచలన వ్యాఖ్యలు చేసిన మర్రి శశిధర్ రెడ్డి

ఓ వైపు ఈడీ..మరోవైపు ఐటీ

తెలంగాణాలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ విస్తృత తనిఖీలు చేస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రులు టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు మంత్రి తలసాని టార్గెట్ గా అతని బ్రదర్స్, PAను ఈడీ అధికారులు విచారించారు. ఇక తాజాగా అతని కొడుకు సాయికిరణ్ కు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఐటీ అధికారులు తెల్లవారుజామున 5 గంటల నుండి సోదాలు చేస్తున్నారు.  50 బృందాలు ఏకకాలంలో అతని బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో భారీగా డబ్బును సీజ్ చేసినట్లు తెలుస్తుంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లావాదేవీలపై భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. కాగా కన్వీనర్ కోటా మెడికల్ సీట్లను కూడా కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. దీనితో మొత్తం 4 మల్లారెడ్డి మెడికల్ కాలజిల బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశిలీస్తున్నారు.  మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను అధికారులు స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన ఫోన్ ను పక్కన ఉన్న క్వార్టర్స్ లో దాచినట్లు తెలవగా దానిని అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మల్లారెడ్డి సోదరుని ఇంట్లో ఓ లాకర్ ను గుర్తించిన అధికారులు దానిని బయటి వ్యక్తి సహాయంతో పగలగొట్టారు. ఆ లాకర్ లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.

భర్తతో కలిసి షాపింగ్ కు వెళ్లిన మహిళ..నిండా ముంచిన కొత్త బట్టలు..పాపం చివరకు ఏం జరిగిందంటే?

తగ్గని సిట్ దూకుడు..

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేరళకు చెందిన జగ్గూజికి లుకౌట్ నోటీసులు ఇచ్చిన సిట్ తాజాగా BL సంతోష్ కార్యాలయానికి నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. కాగా నలుగురు టీఆర్.ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయబోయిందని తెరాస ఆరోపణలు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు?

రాష్ట్రంలో ఓ వైపు ఈడీ, మరోవైపు ఐటీ రైడ్స్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ భేటీలో నాయకులకు అప్రమత్తం చేస్తూనే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్నీ చెప్పదల్చుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల గంగుల కమలాకర్ , మంత్రి తలసాని, ఈరోజు మల్లారెడ్డి ఇలా వరుసగా తెరాస రాజకీయ నేతలే టార్గెట్ గా రైడ్స్ జరగడంతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. అసలేం జరుగుతుంది? ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయో ఈ భేటీలో తెలుసుకోనున్నారు.

First published:

Tags: CM KCR, Hyderabad, Telangana