హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRSLP Meeting: ఆద్యంతం ఆసక్తికరంగా టీఆర్​ఎస్​ఎల్పీ సమావేశం.. ఈడీ, సీబీఐలపై KCR హెచ్చరిక

TRSLP Meeting: ఆద్యంతం ఆసక్తికరంగా టీఆర్​ఎస్​ఎల్పీ సమావేశం.. ఈడీ, సీబీఐలపై KCR హెచ్చరిక

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఆసక్తికరంగా సాగింది. టీఆర్ఎస్​ను జాతీయ పార్టీగా ప్రకటిస్తారని అందరూ భావించినా గులాబీ బాస్​ వేచి చూసే ధోరణిని అవలంభించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ (TRS Chief KCR  ) అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం (TRSLP Meeting) ఆసక్తికరంగా సాగింది. ఇదే సమావేశంలో టీఆర్ఎస్​ (TRS)ను జాతీయ పార్టీగా ప్రకటిస్తారని అందరూ భావించినా గులాబీ బాస్​ మరికొంత కాలం వేచి చూసే ధోరణిని అవలంభించారు. అయితే ఈ సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు (Central investigative agencies) దాడులు చేయవచ్చనే విషయాన్ని సూటిగా చెప్పేశారు టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్.

  మునుగోడు ఉపఎన్నికలో (Munugodu By elections) గెలుస్తామని KCR ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో నిలుస్తాయని  ఆశాభావం వ్యక్తం చేశారు గులాబీ బాస్​. ప్రతి ఎమ్మెల్యేకు 2 గ్రామాలు చొప్పున కేటాయించారు.

  దర్యాప్తు సంస్థలకు భయపడేది లేదని కేసీఆర్ (KCR) అన్నారు ​.. శివసేన , ఆర్జేడీ, ఆప్‌లను కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేశాయని గులాబీ బాస్​ ఆరోపించారు. బీజేపీ బెదిరింపులను పట్టించుకోవద్దని కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడ నడవదని.. భాజాపా మనల్ని ఏం చేయలేదని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

  ఈడీ , సీబీఐని చూసి భయపడాల్సిన అవసరం లేదని టీఆర్​ఎస్​ నాయకులకు కేసీఆర్ భరోసా కల్పించారు. కేంద్రం మనల్ని మరింతగా టార్గెట్ చేస్తుందని.. వాళ్లకి అవకాశమిచ్చే ఏ పనుల్ని చేయొద్దని భేటీలో  (TRSLP Meeting) కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. ఈడీ (ED), సీబీఐలను (CBI) మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోంని కేసీఆర్ ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీ పాచికలు పనిచేశాయి కానీ, ఢిల్లీ, బీహార్‌లలో ఫెయిల్ అయ్యాయని కేసీఆర్ గుర్తుచేశారు. మునుగోడులో బీజేపీ అడ్రస్ గల్లంతేనని.. వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు టీఆర్ఎస్‌కేనని పేర్కొన్నారు గులాబీ బాస్​.

  Telangana Debt: మళ్లీ అప్పు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వచ్చే వారమే బాండ్ల వేలం!

  అంతకుముందు భేటీ అయిన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ (KCR) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో సెప్టెంబర్ (September) 17వ తేదిని తెలంగాణ జాతీయ సమైక్యతా దినం(National Integration Day)గా ప్రకటించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈనెల 16వ తేది నుంచి 18వరకు మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈవేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు.

  మూడ్రోజుల పాటు కార్యక్రమాలు..

  రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. వజ్రోత్సవ ప్రారంభ వేడుకలను 2022 సెప్టెబర్ 16,17,18 మూడురోజుల పాటు.... ముగింపు వేడుకలను... 2023 సెప్టెంబర్ 16,17,18 మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CBI, CM KCR, Enforcement Directorate, Hyderabad, Telangana Politics, TRS leaders

  ఉత్తమ కథలు