Home /News /telangana /

TS POLITICS CM KCR DAUGHTER TRS MLC KALVAKUNTLA KAVITHA WELCOMES AMIT SHAH WITH SERIES OF QUESTIONS AMID BJP MEETING AT TUKKUGUDA NZB MKS

Amit Shah | Kavitha : అమిత్ షాకు కవిత వెరైటీ వెల్కమ్.. ఇది కపటత్వం కాదా? అంటూ..

కవిత, అమిత్ షా

కవిత, అమిత్ షా

హైదరాబాద్ శివారు తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభకు వస్తోన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెరైటీగా స్వాగతం పలికారు. తెలంగాణకు వెల్కమ్ అంటూనే షాపై ప్రశ్నల బాణాలు సంధించారు.

    (P.Mahendar, news 18, Nizamabad)
    బండి సంజయ్ రెండో విడత ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా శనివారం తుక్కుగూడ (మహేశ్వరం)లో బీజేపీ నిర్వహిస్తోన్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ వస్తోన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెరైటీగా స్వాగతం పలికారు. తెలంగాణకు వెల్కమ్ అంటూనే అమిత్ షాపై ప్రశ్నల బాణాలు సంధించారు. కేసీఆర్ కొడుకు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. అమిత్ షాకు ఏకంగా 27 ప్రశ్నలు సంధించిన కొద్ది గంటలకే కవిత సైతం ట్విటర్ వేదికగా కేంద్రంపై దుమ్మెత్తిపోశారు..

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షా ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణలో పర్యటించనున్నఅమిత్ షాను వివిధ అంశాలపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.

    CM KCR ఫలితం కాచుకో: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ -అర్థమేంటి? Z-కేటగిరీ : బీజేపీ-ప్రజాశాంతి పొత్తు?


    తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత, బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్: రూ. 1350 కోట్లు, GST పరిహారం: రూ. 2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటి అని ప్రశ్నించారు.

    Plants in Moon Soil: చంద్రుడి మీది మట్టిలో మొక్కలు.. అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం.. ఇక వ్యవసాయం


    గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ & మిషన్ భగీరథకు ₹ 24,000 కోట్ల నిధులు ఇవ్వాలన్న నీతి అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

    Liquor Ban : తెలంగాణలో మద్య నిషేధం -కాంగ్రెస్ గెలిస్తే చేస్తామంటూ VH సంచలనం


    అమిత్ షా జీ, కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

    Monsoon : రైతులకు శుభవార్త.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. సంవృద్ధిగా వర్షాలు: IMD





    బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం మరియు మతపరమైన అల్లర్లపై, భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం మరియు LPGని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనంపై మీ సమాధానం ఏమిటని కేంద్ర మంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
    Published by:Madhu Kota
    First published:

    Tags: Amit Shah, Bjp, Kalvakuntla Kavitha, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు