Home /News /telangana /

TS POLITICS CM KCR BRS WILL BE ALTERNATIVE NATIONAL AGENDA SAID MINISTER KTR AND TRS WP TOLD IT WAS MISTAKE SUPPORTING BJP PM MODI PREVIOUSLY MKS

TRS | BJP : మోదీకి కేసీఆర్ మద్దతు.. తప్పు ఒప్పుకున్న కేటీఆర్.. బీఆర్ఎస్‌తో దిద్దుబాటు..

కేసీఆర్, మోదీ, కేటీఆర్ (పాత ఫొటోలు)

కేసీఆర్, మోదీ, కేటీఆర్ (పాత ఫొటోలు)

కీలక అంశాల్లో ప్రధాని మోదీ నిర్ణయాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ బేషరతుగా మద్దతు పలకడం పొరపాటేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అంగీకరించారు. గతంలో చేసిన ఈ తప్పులను సరిద్దుకునేలా, దేశానికి కొత్త దారి చూపేలా బీఆర్ఎస్ ఉంటుందన్నారు..

ఇంకా చదవండి ...
బీజేపీ-టీఆర్ఎస్‌ల మధ్య ఉన్నది దోస్తీనా? దుష్మనీనా? అనే చర్చ ఈనాటి కాదు. తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP)నే ప్రధాన ప్రత్యర్థి అన్నట్లుగా టీఆర్ఎస్ (TRS) అనుసరిస్తోన్న వైఖరి కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే అనే వాదన.. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరాటంలో కేసీఆర్ ఇప్పటికీ నమ్మని ఇతర పార్టీలు.. గతంలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలన్నిటీకీ సీఎం కేసీఆర్ (CM KCR) బేషరతుగా మద్దతు పలికిన వైనం.. బీఆర్ఎస్ ఏర్పాటు బీజేపీకే మేలు చేస్తోందని ఊహాగానాలు.. కొడుకును సీఎం చేసేందుకే కేసీఆర్ జాతీయపార్టీ అనే విమర్శలు.. లాంటివి నిత్యం చర్చలో నిలుస్తున్నాయి. వీటిలో చాలా వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).

దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లో పడేసినట్లుగా ఆరోపణలున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా సమయంలో ముందుచూపు లేని లాక్‌డౌన్.. తదితర కీలక అంశాల్లో ప్రధాని మోదీ నిర్ణయాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ బేషరతుగా మద్దతు పలకడం పొరపాటేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అంగీకరించారు.

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. సిన్హాకు షాక్.. ముర్ము ఖుష్..


‘గతంలో పలు కీలక అంశాల్లో ప్రధాని మోదీకి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం పొరపాటే. అయితే తప్పులు తెలుసుకున్న తర్వాత వాటిని దిద్దుకోడానికి మేం వెనుకాడలేదు. బీజేపీ సర్కారు తెలంగాణకు ఏదైనా మంచి చేయకపోదా అని ఎనిమిదేళ్లపాటు ఓపికగా ఎదురుచూశాం. కానీ అటు నుంచి సానుకూలత రాకపోగా వాళ్ల అసత్యప్రచారాలు, దేశాన్ని విభజించే విద్వేష రాజకీయాలు పేట్రేగిపోయాయి. కాబట్టి ఎదురుతిరిగి పోరాడాలని అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు’అని కేటీఆర్ చెప్పారు. ‘డెక్కన్ హెరాల్డ్’పత్రిక కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Monsoon session: 18 నుంచి ఢిల్లీలో దబిడి దిబిడే -బీజేపీకి చుక్కలు చూపించేలా KCR ప్లాన్


దేశంలో 30 కోట్ల జనసముదాయాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ చేస్తోన్న విష రాజకీయాలను, నుపుర్ శర్మ ఉదంతంపై ప్రధాని మౌనాన్ని కేసీఆర్ ప్రశ్నించారని, వాటికి అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా యావత్ దేశాన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. వ్యవసాయం, విద్యుత్, సాగు, తాగునీరు సహా పలు కీలక రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి మోడల్ ను దేశానికీ అందించేలా, భారత్ కు ప్రత్యామ్నాయ అజెండా సెట్ చేసేలా బీఆర్ఎస్ ఉంటుందని, జాతీయ పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సరైన సమయంలో స్వయంగానే ప్రకటన చేస్తారని కేటీఆర్ తెలిపారు.


TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!


కొడుకు కేటీఆర్ ను సీఎం చేయడానికే కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారన్న విమర్శలనూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోసిపుచ్చారు. తనకు సీఎం కావలన్న ఆశలేవీ లేవని, రాబోయే ఎన్నికల్లో గెలుపు ద్వారా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని కేటీఆర్ చెప్పారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ విమర్శలు అర్థరహితమని, కమలం పార్టీనే ఎంతో మంది రాజకీయ వారసులకు అడ్డాగా ఉందని, అయినా, నేతల విషయంలో ప్రజలదే తుది నిర్ణయమని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటన చేసిందని, తద్వారా అది టీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందన్న బీజేపీ విమర్శలకు విలువలేకుండా పోతుందని కేటీఆర్ అన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, KTR, Minister ktr, Pm modi, Telangana, Trs

తదుపరి వార్తలు