హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: పంజాబ్​కు ఓ న్యాయం.. తెలంగాణకో న్యాయమా? కేంద్రంపై కేసీఆర్​​ సీరియస్​.. కార్యాచరణపై టీఆర్​ఎస్ఎల్పీ 21న సమావేశం

CM KCR: పంజాబ్​కు ఓ న్యాయం.. తెలంగాణకో న్యాయమా? కేంద్రంపై కేసీఆర్​​ సీరియస్​.. కార్యాచరణపై టీఆర్​ఎస్ఎల్పీ 21న సమావేశం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై సీఎం కేసీఆర్​ మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో పంజాబ్​కు ఓ న్యాయం తెలంగాణకు మరో న్యాయం చేయడం ఏంటని సీరియస్ అయ్యారు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై సీఎం కేసీఆర్​ మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో పంజాబ్​కు ఓ న్యాయం తెలంగాణకు మరో న్యాయం చేయడం ఏంటని సీరియస్ అయ్యారు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై సీఎం కేసీఆర్​ మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో పంజాబ్​కు ఓ న్యాయం తెలంగాణకు మరో న్యాయం చేయడం ఏంటని సీరియస్ అయ్యారు

  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP government at the Center) తెలంగాణకు చేస్తున్న అన్యాయం (injustice to Telangana)పై సీఎం కేసీఆర్​ (CM KCR) మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో పంజాబ్​కు ఓ న్యాయం తెలంగాణ (Telangana)కు మరో న్యాయం చేయడం ఏంటని సీరియస్ అయ్యారు. ఈ మేరకు కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో (Telangana bhavan) ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం (TRS legislative meeting) జరపాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (k Chandrashekar rao) నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  అదే రోజు ఢిల్లీ బయలుదేరి..

  తెలంగాణ (Telangana)లో యాసంగి వరి ధాన్యాన్ని (paddy procurement) కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు (Paddy buying) చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్ళ  (Paddy buying) మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు.

  ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు..

  కేంద్ర ప్రభుత్వం (Central Government) పంజాబ్ (Punjab) రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం  సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సిఐ (FCI) సేకరించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టిఆర్ఎస్ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

  మంత్రులతో అత్యవసర భేటీ..

  మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర భేటీ (Emergency meeting with ministers) ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ (Erravalli Farmhouse)లో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం (Pre elections) జోరుగా ఉన్న క్రమంలో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇలా భేటీ కావడం చర్చలకు దారితీసింది. ముఖ్యమంత్రితో భేటీకి రావాలని ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ (Erravalli Farmhouse) నుంచి మంత్రులకు ఫోన్‌లు వెళ్లినట్టుగా సమాచారం. దీంతో అందుబాటులో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.

  ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా భేటీలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్‌‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే కేటీఆర్ ( KTR)​ అందుబాటులో లేకపోవడంతో ఆయన సమావేశానికి రాలేకపోయారు.

  First published:

  Tags: Bjp, Central Government, CM KCR, Telangana, TRS leaders

  ఉత్తమ కథలు