హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే మునుగోడులో కష్టాలు తప్పవా ?

KCR: కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే మునుగోడులో కష్టాలు తప్పవా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

TRS| Munugodu: మునుగోడు విషయంలో సీఎం కేసీఆర్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడటం లేదనే చర్చ జరుగుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టీఆర్ఎస్‌కు తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఓ పెద్ద సవాల్. ఈ ఉప ఎన్నికలో గెలిస్తేనే తెలంగాణలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతామని భావిస్తోంది టీఆర్ఎస్. అందుకే ఇక్కడ గెలుపు కోసం తమదైన వ్యూహాలను రచిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్ తరహా ఫలితం ఇక్కడ రాకూడదని సీఎం కేసీఆర్ (CM KCR) గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకే ఇక్కడ గెలుపు కోసం ఆయన తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నారనే టాక్ ఉంది. మునుగోడు (Munugodu) విషయంలో సీఎం కేసీఆర్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడటం లేదనే చర్చ జరుగుతోంది. నిజానికి కొద్దిరోజుల క్రితం మునుగోడులో జరిగిన సభలో కేసీఆర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే టీఆర్ఎస్(TRS) అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. ఈ ఛాన్స్ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వస్తుందని భావించారు.

  కానీ కేసీఆర్ మాత్రం ఆయన పేరును ఖరారు చేయలేదు. దీంతో సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారా ? లేక ఆయన మనసులో మరో అభ్యర్థి కూడా ఉన్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశించడం.. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగా బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన నిజంగా టికెట్ ఆశించి ఉంటే.. ఆ విషయాన్ని టీఆర్ఎస్ అధినేత దృష్టికి తీసుకెళ్లి తన అభీష్టాన్ని చెప్పుకునే అవకాశం ఉంది.

  కానీ బూర నర్సయ్య గౌడ్ బహిరంగంగానే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన గులాబీ పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారా ? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం రావడం లేదనే బూర నర్సయ్య గౌడ్ కామెంట్ చేశారు. దీంతో బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ ఇద్దరూ టీఆర్ఎస్ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.

  KCR: 2024 తరువాత దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్.. కేసీఆర్ కీలక ప్రకటన

  KCR TOUR : గులాబీమయంగా మారిన నిజామాబాద్ .. సీఎం కేసీఆర్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు

  ఈ ఇద్దరూ బీసీ నేతలే కావడం.. మునుగోడుపై ఇద్దరూ ఎంతో కొంత ప్రభావం చూపించే నేతలు కావడం.. వంటి అంశాలు టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా టీఆర్ఎస్‌లో ఇలాంటి ధిక్కార స్వరాలను కేసీఆర్ సహించరు. కానీ ప్రస్తుతం ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకమైన మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి ఉండటంతో.. పరిస్థితిని కేసీఆర్ ఏ విధంగా డీల్ చేస్తారో అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్‌కు కూడా సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Munugodu By Election, Telangana

  ఉత్తమ కథలు