హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: దేశంలో మతతత్వ వాదనతో జాతి విచ్ఛినం అవుతోంది.. కాంగ్రెస్​ పగ్గాలు ఆయనే చేపట్టాలన్న భట్టి విక్రమార్క

Telangana Congress: దేశంలో మతతత్వ వాదనతో జాతి విచ్ఛినం అవుతోంది.. కాంగ్రెస్​ పగ్గాలు ఆయనే చేపట్టాలన్న భట్టి విక్రమార్క

భట్టి విక్రమార్క (ఫైల్​)

భట్టి విక్రమార్క (ఫైల్​)

కాంగ్రెస్​ పదవులకు సోనియా, రాహుల్, ప్రియాంకలు రాజీనామా చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ, అలా జరగలేదు. అయితే ఆయా రాష్ట్రాల పీసీసీలు మాత్రం గాంధీల వారసత్వాన్నే ఎక్కువగా సమర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్​ సైతం అదే బాటలో నడుస్తోంది.

ఇంకా చదవండి ...

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో సీడబ్ల్యూసీ (CWC) సమావేశాన్ని నిర్వహించాలని జీ 23 నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ మేరకు గత వారంలో సీడబ్ల్యుసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఘోర పరాజయంపై చర్చించారు. మరోసారి సీడబ్ల్యూసీ భేటీ కావాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పదవులకు సోనియా, రాహుల్, ప్రియాంకలు రాజీనామా చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ, అలా జరగలేదు. అయితే ఆయా రాష్ట్రాల పీసీసీలు మాత్రం గాంధీల వారసత్వాన్నే ఎక్కువగా సమర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్​ (Telangana Congress)సైతం అదే బాటలో నడుస్తోంది. కాంగ్రెస్​  పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని సీఎల్పీ నేత (CLP Leader) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramaraka) ధీమాను వ్యక్తం చేశారు. బుధవారం నాడు హైదరాబాద్​లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వాలను సమర్ధిస్తూ సీఎల్పీ  సమావేశం తీర్మానం చేసింది.  మతతత్వ వాదనతో జాతి విచ్చిన్నం కుట్ర జరుగుతోందని భట్టీ అన్నారు. వీటిపై పోరాటానికి రాహుల్​ గాంధీ (Rahul Gandhi)నే కాంగ్రెస్​ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క చెప్పారు. దేశ రక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను చేపట్టాలని కూడా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు.

పార్టీని కాపాడేందుకు సోనియా గాంధీ ( Sonia Gandhi )తీసుకొన్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని సీఎల్పీ నేత భట్టీ చెప్పారు. Congress భావజాలాన్ని కాపాడేందుకు త్యాగాలు చేసిన కుటుంబం గాంధీలదని భట్టి విక్రమార్క వెల్లడించారు. గాంధీ ఫ్యామిలీ త్యాగాతోనే కపిల్​ సిబల్​ (Kapil Sibal) కేంద్రంలో మంత్రిగా పనిచేశారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సీనియర్ నేతల సమావేశం రాహుల్ నాయకత్వం కోసమేనని ఆయన చెప్పారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కపిల్ సిబల్  స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి గాంధీ కుటుంబం తప్పుకోవాలని కోరారు.  అందుకు ఇదే సరైన సమయం అని అన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. గాంధీలు స్వచ్ఛందంగానే ఈ పని చేయాలని, ఎందుకంటే.. ప్రస్తుత పొజిషన్‌లకు నామినేట్ చేసిన కమిటీ.. ఎలా వారిని తొలగిస్తుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ.. ఒక రకంగా ఇప్పుడు ఆయనే అధ్యక్షుడు అని కపిల్ సిబల్ అన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు పంజాబ్ వెళ్లారని, అక్కడకు వెళ్లి సీఎం క్యాండిడేట్ చరణ్‌జిత్ సింగ్ చన్నీ అని ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన ఏ అధికారంతో ఆ నిర్ణయం ప్రకటించారని అడిగారు. ఆయన పార్టీకి అధ్యక్షుడు కాదని, కానీ, పార్టీ నిర్ణయాలు అన్నీ ఆయనే తీసుకుంటారని వివరించారు.

First published:

Tags: Bhatti Vikramarka, Rahul Gandhi, TS Congress

ఉత్తమ కథలు