Home /News /telangana /

TS POLITICS CLASH BETWEEN TRS AND BJP WORKERS DURING BANDI SANJAY PADAYATRA IN JANGAMA DISTRICT MANY INJURED SNR

BJP VS TRS : బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రలో ఘర్షణ .. రాళ్ల దాడిలో గాయపడ్డ బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

BJP VS TRS : ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటే మరోవైపు జనగామ జిల్లాలో రాజకీయ రణరంగం నెలకొంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న పాదయాత్రలోనే టెన్షన్ వాతావరణం నెలకొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Jangaon, India
ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటే మరోవైపు జనగామ(Jangama)జిల్లాలో రాజకీయ రణరంగం నెలకొంది. తెలంగాణ బీజేపీ(BJP) అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)చేస్తున్న పాదయాత్రలోనే టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవరుప్పాల(Devaruppala)లో ప్రజాసంగ్రామయాత్ర(Prajasangramayatra)లో పాల్గొన్న బండి సంజయ్‌ అక్కడి ప్రజలను ఉద్దేశించి టీఆర్ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని..ఉద్యోగలు ఏ ఒక్కరికి ఇవ్వలేదని విమర్శించారు. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు టీఆర్ఎస్‌(TRS) శ్రేణులు బండి సంజయ్ వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత పెట్రేగిపోవడంతో టీఆర్ఎస్‌ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. దాడికి పాల్పడ్డారు. దానికి ప్రతీకగా బీజేపీ శ్రేణులు ఎదురుదాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు.

Crime news : జెండా పండుగకు వెళ్లి వస్తున్న భార్య పీక కోసి చంపిన భర్త ... కారణం తెలిస్తే షాక్ అవుతారు



రాజకీయ రణరంగం...
విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు చేరుకున్నారు.అయి రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసారు. ఈఘర్షణలో బీజేపీ శ్రేణులకే ఎక్కువగా గాయాలయ్యాయి. ఈఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీస్ కమిషనర్‌కి ఫోన్‌ చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్‌ గూండాలు రాళ్లు రువ్వుతుంటే పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పర్మిషన్ తీసుకొని మరీ పాదయాత్ర చేపడుతుంటే...తమపై దాడి జరుగుతుందని తెలిసి పోలీసులు చోద్యం చూస్తుండిపోయారని మండిపడ్డారు.



స్వాతంత్య్రం వచ్చిన రోజున కూడా..
మూడో విడత ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా బండి సంజయ్ జనగామ జిల్లా దేవరుప్పాలలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఉదయం శ్రీసాయి ప్రశాంతి విద్యానికేతన్‌ హైస్కూల్‌లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత చేపట్టిన పాదయాత్రలో కేసీఆర్ కుటుంబానికి పదవుల కోసమా తెలంగాణ వచ్చింది.? ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన నీచ చరిత్ర టీఆర్ఎస్‌దని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ 8ఏళ్లలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. దానికి బదులుగానే టీఆర్ఎస్‌ శ్రేణులు సైతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు.

ఉద్రిక్తత..
దీంతో, రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ 10 మంది వచ్చి పోటుగాండ్ల మాదిరిగా మాట్లాడితే, పాదయాత్రకు అడ్డుతగిలితే ఊరుకునేది లేదంటూ టీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bandi sanjay, Bjp, Telangana Politics, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు