Home /News /telangana /

TS POLITICS CHANGES IN TELANGANA BJP PRESIDENT BANDI SANJAY PADAYATRA HEAT WAVE IS THE MAIN REASON AK

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర రూట్‌లో మార్పులు.. అసలు కారణం ఇదే..

బండి సంజయ్ పాదయాత్ర (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ పాదయాత్ర (ఫైల్ ఫోటో)

Bandi Sanjay: అనుకున్న విధంగానే ఈ నెల 14న మహేశ్వరంలో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ ముఖ్యనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

    తెలంగాణ బీజేపీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర రూట్ మ్యాప్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం జడ్చర్ల వరకు యథావిధిగా యాత్ర సాగుతుంది. ఆ తరువాత పాదయాత్రలో మార్పులు చేయనుంది. జడ్చర్ల నుంచి షాద్‌నగర్ నియోజకవర్గం మీదుగా బండి సంజయ్(Bandi Sanjay) పాదయాత్ర మహేశ్వరం చేరుకోనుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ పాదయాత్ర నారాయణపేటలో కొనసాగుతోంది. ముందుగా జడ్చర్ల (Jadcherla) నుంచి నాగర్‌కర్నూలు, కల్వకుర్తి మీదుగా మహేశ్వరం(Maheshwaram) వెళ్లాలని బండి సంజయ్ భావించారు. అయితే తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత పెరగడంతో పాదయాత్ర అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు. రోజూవారీగా ముందుగా నిర్ధేశించుకున్న ప్రకారం పాదయాత్ర 13 కిలోమీటర్లు సాగడం లేదు.

    ఈ నెల 5న బండి సంజయ్ మహబూబ్‌నగర్(Mahbubnagar) చేరుకుంటారు. మొదట అనుకున్న రూట్ మ్యాప్ ప్రకారం పాదయాత్ర చేపడితే మే 14 నాటికి మహేశ్వరం చేరుకునే అవకాశం లేకపోవడంతో పాదయాత్రలో మార్పులు చేయాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగర్‌కర్నూలు, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పాదయాత్రను రద్దు చేసుకున్నట్టు సమాచారం. బండి సంజయ్ పాదయాత్ర రూట్‌లో మార్పులు చేయడంతో.. పార్టీ నాయకత్వం స్థానిక నేతలను అప్రమత్తం చేసింది. బండి సంజయ్ పాదయాత్ర రూట్‌లో ఏర్పాట్లు చేయడంతో పాటు స్థానిక ప్రజల సమస్యలను గుర్తించడంతో పాటు స్థానికంగా జనసమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించింది. ఇక అనుకున్న విధంగానే ఈ నెల 14న మహేశ్వరంలో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ ముఖ్యనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

    గత నెల 14న అలంపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన బండి సంజయ్.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు పూర్తి ఆధిక్యత ఉంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది.

    Rahul Gandhi: కాంగ్రెస్‌కు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ షాక్.. ఆ సభకు నో పర్మిషన్

    Revanth Reddy: ఆ నేతతో రేవంత్ రెడ్డి రహస్య చర్చలు.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చ

    అందుకే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై బీజేపీ పెద్దలు సీరియస్‌గా ఫోకస్ చేశారు. సెగ్మెంట్లవారీగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి సహా పలువురు నేతలు పాలమూరు జిల్లాలో బీజేపీ బలోపేతంపై పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లో బలంగా ఉన్న టీఆర్ఎస్, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌‌కు ధీటుగా ఎదిగేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bandi sanjay, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు