Home /News /telangana /

TS POLITICS CHANCE OF KCR ANNOUNCING KOOSUKUNTLA PRABHAKAR REDDY NAME AS TRS CANDIDATE FOR MUNUGODE BY ELECTIONS SNR

Telangana : మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా మూడో సారి ఆయనే .. బహిరంగసభలో కేసీఆర్ ప్రకటించే ఛాన్సు

(Photo Credit:Face Book)

(Photo Credit:Face Book)

Telangana: గులాబీ బాస్‌ బహిరంగసభ ద్వారా మునుగోడు ఓటర్లను తమవైపు తిప్పుకోవడంతో పాటు అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడా కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అందరూ ఊహించినట్లుగా కాకుండా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు బహిరంగసభపైనే మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా ఆయన పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
మునుగోడు(Munugode)ఉపఎన్నికలు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ (Congress)సిట్టింగ్‌ స్థానం రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy)రాజీనామాతో కాళీ కావడంతో బైపోల్‌ ఉత్కంఠగా మారింది. రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీ(BJP)నుంచే బరిలోకి దిగుతుండగా .. కాంగ్రెస్‌ ఆయనపై గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధిని ఎంపిక చేసే పనిలో పడింది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్‌(TRS)కూడా ఈస్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని తెగ ట్రై చేస్తోంది. అందుకోసమే గులాబీ బాస్‌ బహిరంగసభ ద్వారా మునుగోడు ఓటర్లను తమవైపు తిప్పుకోవడంతో పాటు అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడా కొత్త స్ట్రాటజీ(Strategy)ని ఫాలో అవుతున్నారు. అందరూ ఊహించినట్లుగా కాకుండా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు బహిరంగసభపైనే మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్ధి పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది.

Munugodu: మునుగోడుపై రేపే కీలక నిర్ణయం.. ఆ రెండు పార్టీల్లో టెన్షన్



ముచ్చటగా మూడోసారి..
ఊహాగానాలు, అందరూ ఆలోచనలకు భిన్నంగా ఆలోచిస్తారు టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌. ముఖ్యంగా ఎన్నికల విషయానికి వస్తే ఆయన వేసే ఎత్తులు, వేసే పాచికలు మిగిలిన పార్టీలకు అంతుచిక్కవనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మునుగోడు బైపోల్‌ విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట కారు గుర్తు పార్టీ అధినేత. రెండు ఉపఎన్నికల్లో గెలిచి బలంగా ఉన్న బీజేపీని గట్టి దెబ్బ కొట్టడానికి ఒక రోజు ముందే బహిరంగ సభ ప్లాన్ చేసిన కేసీఆర్..అంతే తెలివిగా అందరి కంటే ముందుగా తమ పార్టీ అభ్యర్ధి పేరును ప్రకటించబోతున్నారట. శనివారం మునుగోడులో జరిగే బహిరంగసభ వేదికపైనే టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది.


ఆయనే మళ్లీ బరిలోకి..
మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రెండు సార్లు ఓఢిపోయారు. 2014,2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గుర్తుతోనే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2018లో కాంగ్రెస్‌ తరపున గెలిచి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మరోసారి పోటీ చేసే అవకాశాన్ని ఇస్తున్నారని తెలుస్తోంది. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం మాత్రం ఖచ్చితంగా ఆయన్నే బరిలోకి దింపాలనే కృతనిశ్చయంతో ఉన్నారట. ఇక పార్టీలో కూసుకుంట్ల అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాన్ని, అసమ్మతి నేతలను శాంతింపజేసే బాధ్యతను జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డికి సీఎం అప్పగించారు.

Telangana : తెరపైకి జిల్లా పేరు మార్పు అంశం .. సర్దార్ సర్వాయి పాపన్నపేరుతో మార్చాలని బీజేపీ డిమాండ్



సభలో పేరు ప్రకటించే ఛాన్స్ ..
ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో కూసుకుంట్లకి మద్దతిచ్చి గెలిపించాలని సీఎం కేసీఆర్‌ సదరు మంత్రికి సూచించినట్లుగా తెలుస్తోంది. రెండు సార్లు తిరస్కరించిన మునుగోడు ఓటర్లు మూడో సారి సింపతీ కోసమైనా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓట్లు వేస్తారనేది గులాబీ బాస్‌ ఆలోచనగా తెలుస్తోంది. కొత్తగా అభ్యర్ధిని ఎంపిక చేసి కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం కంటే గతంలో పోటీ చేసిన కూసుకుంట్ల అయితేనే బెటర్‌ అనే ఐడియాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి కేసీఆర్‌ లెక్కలు, అంచనాలు ఏమేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Munugode Bypoll, Telangana Politics, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు