హోమ్ /వార్తలు /తెలంగాణ /

కేసీఆర్‌కు కేంద్రం షాక్… ఆర్టీసీ సమ్మెపై సీరియస్ ?

కేసీఆర్‌కు కేంద్రం షాక్… ఆర్టీసీ సమ్మెపై సీరియస్ ?

ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తిగా లేకపోతే... గవర్నర్ ద్వారా ఈ అంశంలో కేంద్రం చర్యలు తీసుకుంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది.

  తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం సీరియస్‌గా దృష్టి పెట్టిందా ? ఆర్టీసీ కార్మికుల వరుస ఆత్మహత్యలపై కేంద్రం దృష్టి పెట్టిందా ? జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణలో పది రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెబుతున్నా... అవి ఏ మాత్రం ప్రజల కష్టాలను తీర్చిలేకపోతున్నాయనే వాదన ఉంది. దీనికి తోడు రెండు మూడు రోజులుగా పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడంతో సమ్మె మరింత తీవ్రతరం అవుతోంది.

  ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై ఫోకస్ పెట్టిన కేంద్రం... దీనిపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసైను ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ రోజే గవర్నర్ తమిళిసైకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కావడం గమనార్హం. ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటోందనే అంశంపై గవర్నర్ ద్వారా కేంద్రం ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తిగా లేకపోతే... గవర్నర్ ద్వారా ఈ అంశంలో కేంద్రం చర్యలు తీసుకుంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. అదే జరిగితే ఈ విషయంలో కేసీఆర్‌కు కేంద్రం ఒకరకంగా షాక్ ఇచ్చినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆర్టీసీ సమ్మెపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు గవర్నర్ తమిళిసై ఏం నివేదిక ఇస్తారు ? దీనిపై కేంద్రం ఏ రకంగా స్పందిస్తున్నది ఆసక్తి రేపుతోంది.

  First published:

  Tags: Amit Shah, CM KCR, Pm modi, Rtc jac, Telangana, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు