Home /News /telangana /

TS POLITICS BSP PRESIDENT RS PRAVEEN KUMAR WILL PLAN TO CONTEST IN THE NEXT TELANGANA ASSEMBLY ELECTIONS FROM THAT CONSTITUENCY PRV

RS Praveen kumar: ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ పోటీ చేసే స్థానం ఖరారు..?  తప్పకుండా గెలుస్తారని పీకే టీం రిపోర్టు..?

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫొటో)

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫొటో)

రేపల్లె శివ ప్రవీణ్​కుమార్ (RS Praveen kumar)​. 1995 ఐపీఎస్​ (IPS) అధికారి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్​​ఎస్​ ప్రవీణ్​కుమార్​గా ప్రసిద్ధి. బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరిపోయారు. ఇపుడు ఆయన పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.

    రేపల్లె శివ ప్రవీణ్​కుమార్ (RS Praveen kumar)​. 1995 ఐపీఎస్​ (IPS) అధికారి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్​​ఎస్​ ప్రవీణ్​కుమార్​గా ప్రసిద్ధి. అయితే ఐపీఎస్​గా ఆయన అందించిన సేవలతోనే కాకుండా బలహీన వర్గాలకు అండగా నిలబడి తెలుగు రాష్ట్రాల్లో అంతే పేరు తెచ్చుకున్నారు. ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ అంటే బలహీన వర్గాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఏ ఊరికెళ్లినా ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అంటే ఇట్టే ఆయన గురించి అనర్గళంగా చెప్పేస్తారు. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఆయనను విమర్శించాలంటే రెండు, మూడు సార్లు ఆలోచించే స్థాయికి ప్రవీణ్​కుమార్​ ఎదిగారు. కానీ, సడెన్​గా ఆయన రాజకీయ నాయకులకు ప్రత్యర్థి అయిపోయారు. బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరిపోయారు. బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. అయితే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assmebly elcetions)  చేవెళ్ల నియోజకవర్గం (Chevella Constituency) నుండి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ పార్టీని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ఒక్కసారిగా చేవెళ్ల గడ్డపై జెండా ఎగురవేస్తాం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

    చేవెళ్ల (Chevella)ఎస్సీ నియోజకవర్గం కావడం హైదరాబాద్ కి దగ్గరగా ఉండటం, మిగతా పార్టీలపైనా వ్యతిరేకత ఎక్కువగా ఉండటం.. బహుజన సమాజ్ పార్టీ (BSP)కి బాగా కలిసి వచ్చే అంశం. ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేవెళ్లలో గెలుస్తడు అని ప్రశాంత్​ కిషోర్​ ఐ ప్యాక్ (IPAC) రిపోర్ట్ ఇచ్చినట్టు టీఆర్ఎస్ (TRS) శ్రేణుల్లో వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

    మరోవైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాల నడుమ అన్ని పార్టీలూ తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. 85 శాతానికిపైగా బహుజనులుండే తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే ధ్యేయంగా బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన యాత్ర చేస్తున్నారు. బహుజనులకు ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు బహుజన సమాజ్‌ పార్టీ (BSP) తెలంగాణ విభాగం ఈ బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకా రం చుట్టింది. 300 రోజుల పాటు సుదీర్ఘంగా యాత్ర చేపడుతున్నట్టు బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కాగా, ఇప్పటికే ఈ యాత్ర ప్రారంభమైంది.

    ముందస్తు ఎన్నికలకు వెళతారని..

    నిజానికి జనవరి 15న బీఎస్పీ చీఫ్ మాయావతి జన్మదినం రోజునే బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభించాలని ప్రవీణ్ కుమార్ నిర్ణయించినా కరోనా కారణంగా వాయిదా వేశారు. కాగా, గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారని, 2022 నవంబర్-డిసెంబర్ లో గుజరాత్ ఎన్నికలతో కలిపి తెలంగాణ ఎన్నికలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేశారనే ఊహాగానాల నడుమ అన్ని పార్టీలూ ఎన్నికల సన్నద్దత మొదలుపెట్టాయి. తెలంగాణ బీఎస్పీలో కీలకంగా ఉన్న ప్రవీణ్ కుమార్ పాదయాత్రలోనే ప్రచారం ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bsp, Chevella, Rs praveen kumar, Telangana Assembly, Telangana Politics

    తదుపరి వార్తలు