హోమ్ /వార్తలు /తెలంగాణ /

RS Praveen Kumar | BSP: మితిమీరిన టీఆర్ఎస్ ఆగడాలు.. కేసీఆర్‌ను గద్దెదించాల్సిందే: ఆర్ఎస్పీ

RS Praveen Kumar | BSP: మితిమీరిన టీఆర్ఎస్ ఆగడాలు.. కేసీఆర్‌ను గద్దెదించాల్సిందే: ఆర్ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా కార్యక్రమంలో బీఎస్పీ ఆర్ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా కార్యక్రమంలో బీఎస్పీ ఆర్ఎస్పీ

టీఆర్ఎస్ పార్టీ ఆగడాలు మితిమీరాయని, కామారెడ్డిలో తల్లీకొడుకుల సజీవదహనం ఘటలకు గులాబీ నేతలే బాద్యులని, ప్రజలు రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ ను గద్దెదించాలని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

(Katta Lenin, News 18, Adilaba)

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నారని బహుజన సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తాజాగా టిఆర్ఎస్ నాయకుల ఆగడాలు భరించ లేక కామారెడ్డిలో తల్లీకొడుకులు సజీవ దహనమయ్యారని పేర్కన్నారు. ఈ ఘటనను తీవ్ర ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం కూడా చేశారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని గద్దెదించాలని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భీం దీక్ష ముగింపు కార్యక్రమానికి బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఎస్పీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ సమక్షంలో పలువురు బీఎస్పీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బహుజన యాత్ర తలపెట్టిన ఆర్ఎస్పీ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పటికీ భీం దీక్ష ముగింపు కార్యక్రమం కోసం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రంలో ఆర్ఎస్పీ

శిష్యుడు KCRకు స్పాట్ పెడుతోన్న Chandrababu -రూ.2లక్షల అస్త్రం.. టీటీడీపీనే ప్రత్యామ్నాయం!


అంతకు ముందు కార్యకర్తలు నార్నూరు మండల కేంద్ర్రానికి చేరుకున్న ఆర్ఎస్పీకి డోలు డప్పులు గుసాడి నృత్యాలతో స్వాగతం పలికారు. కార్యకర్తలతో కలిసి ఆయన నార్నూరు మండల కేంద్రంలోని కొమురంభీం, డా. బి. ఆర్. అంబేద్కర్, లాహుజీ సాళ్వే, లక్కీశా బంజారా, జాలంసింగ్ ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నార్నూర్ లో ఖాందేవ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరెగింపులో పాల్గొన్నారు.

నార్నూరులో ఆర్ఎస్పీ సమక్షలో బీఎస్పీలోకి చేరికలు

Target 400 Seats: సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్ -బేషరతుగానే కాంగ్రెస్‌లో చేరిక!


ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న ఆదివాసీల పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వ విద్యాలయాలకు ఆగమేఘాల మీద ప్రభుత్వం అనుమతినిస్తోందని, కానీ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పటు విషయంలో మాత్రం సీఎం కేసీఆర్ కు సమయం దొరకడం లేదని ఎద్ద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.

భీం దీక్ష ముగింపు కార్యక్రమంలో మహిళలు

TRS Formation Day: 27న కేసీఆర్ యుద్దభేరీ -హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవస్థాపక వేడుక


3వ నంబర్ జీవోను రద్దు చేసిన కేసీఆర్ సర్కారు దానికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగ హక్కుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. భీమ్ దీక్ష సభకు ఉమ్మడి జిల్లా స్వేరోస్ టీమ్ సభ్యులు, బహుజన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నార్నూరు కు వెళ్ళే దారిలో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రవీణ్ కుమార్ పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో ఘనంగా స్వాగతం లభించింది.

First published:

Tags: Adilabad, Bsp, CM KCR, Rs praveen kumar, Trs