Home /News /telangana /

TS POLITICS BSP LEADER RS PRAVEEN KUMAR PLANS TO CONTEST FROM STATION GHANPUR ASSEMBLY SEGMENT NS

RS Praveen Kumar: ఆ అసెంబ్లీ స్థానంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్ను.. 4 సార్లు గెలిచిన ఆ ఎమ్మెల్యేపై పోటీకి సై?

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫొటో)

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫొటో)

మొన్న వరకు తుంగతుర్తి లేదా అలంపూర్ నుంచి పోటీ చేయాలని భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) .. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సత్తా చాటాలని భావిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి. సర్వీసులో ఉన్న సమయంలోనూ ఖాకీ యునిఫామ్ ను విడిచి డిప్యుటేషన్ పై గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి వాటి అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటాలని ప్రయత్నిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి బీఎస్పీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారని చాలా రోజుల పాటు ఊహాగానాలు సాగాయి. స్వేరో టీం కూడా రంగంలోకి దిగి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపే లక్ష్యంగా పని ప్రారంభించిందన్న ప్రచారం కూడా సాగింది. తుంగతుర్తిలో పోటీ చేయని పరిస్థితిలో ప్రవీణ్ కుమార్ తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

    అయితే.. ఇప్పుడు ఆయన మనసు మారిందని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన టీం అక్కడ పని కూడా ప్రారంభించందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఆయన నాలుగు సార్లు గెలుపొందారు.
    Manickam Tagore:తెలంగాణలో పొత్తులు,గిత్తులు లేవ్..టీఆర్‌ఎస్‌, బీజేపీపై పోరాడటంలో తగ్గేదేలే

    అయితే.. ఈ సారి రాజయ్యపై వ్యతిరేకత అధికంగా ఉందని.. ఇంకా టీఆర్ఎస్ లోని ఇతర వర్గాలు ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాలు తనకు కలిసి వస్తాయని.. దీనికి తన ఇమేజ్ తోడు అయితే సునాయసంగా గెలుస్తానని ప్రవీణ్ కుమార్ అంచనా వేసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

    ఫలితాల్లో ఏమైనా తేడా వస్తే.. అనంతరం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ వరంగల్ స్థానం నుంచే పోటీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bsp, Rs praveen kumar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు