హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

మంత్రి కేటీఆర్ (File Image)

మంత్రి కేటీఆర్ (File Image)

Telangana: రాజకీయ దురుద్ధేశ్యంతో తనను, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసులు పేర్కొన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ కేసు అంశంలో ఓ వైపు సిట్(Sit) వేగంగా దర్యాప్తు చేస్తుంటే.. మరోవైపు ఈ కేసు విషయంలో రాజకీయ పరిణామాలు కూడా జోరందుకున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో తనపై పదే పదే నిరాధార ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి(Bandi Sanjay) లీగల్ నోటీసుల పంపారు. రాజకీయ దురుద్ధేశ్యంతో తనను, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసులు పేర్కొన్నారు. మరోవైపు సిట్ నోటీసులు తనకు మాత్రమే కాదు.. మంత్రులు కేటీఆర్(Ktr), సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేసీఆర్ , కేటీఆర్‌లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. TSTS చైర్మన్ కేటీఆర్ కు దగ్గరి బంధువని రేవంత్ చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను TSTS మాత్రమే నిర్వహిస్తోందని తెలిపారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగిందన్నారు.కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్‌ ఆఫీస్‌ నుంచే లీకేజీ వ్యవహారం మొత్తం నడిచిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇక ఈ పేపర్ లీకేజీ కేసులో చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ రేవంత్‌కు సిట్‌ అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన సిట్ అధికారులు రేవంత్ ఇంటి గోడకు నోటీసులు అతికించి వెళ్లారు. మార్చి 23న ఉదయం 11గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన సిట్‌ ముందు హాజరయ్యారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డిపై కేసు నమోదవుతుందా ?.. అదే జరిగితే బండి సంజయ్ పరిస్థితి ఏంటి ?

Politics: భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్ యాత్రలో YSRపాదయాత్ర ఫ్లెక్సీలు పెట్టడానికి కారణం అదెనా..?

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ బాధ్యుడని బండి సంజయ్ ఆరోపించారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో ఒకే మండలం నుంచి50 మందికిపైగా.. క్వాలిఫై అయ్యారని చెప్పారు. ఓ చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నియమించిన సిట్ దీనిపై విచారిస్తుందా అని అడిగారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. అటు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి.... తన ఇంటికే ఐదు ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ఇచ్చుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువత జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు.

First published:

Tags: KTR, Revanth Reddy, Telangana

ఉత్తమ కథలు