తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్షమైన MIM చేసిన అభ్యర్ధన మేరకు మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కాగా శాసనమండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కాగా..మరొకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం. ఇక ఈ రెండు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది.
కాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి MIMకు చెందిన సయ్యద్ హాసన్ జాఫ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన పదవీ కాలం మే 1తో ముగియనుండంతో ఈ స్థానానికి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్-MIM మిత్రపక్షాలుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి MIM అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
తెలంగాణలో ఎన్నికలు జరిగే స్థానాలు..
ఇక తెలంగాణలో హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది.
స్థానిక సంస్థల ఎన్నిక జరిగే ఒకే స్థానం : హైదరాబాద్
ఏపీలో 13, తెలంగాణలో 2 స్థానాలకు మొత్తం 15 స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను (MLC Election Shedule) ఎలెక్షన్ కమీషన్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని రెండు స్థానాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వారి పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో ఈసి (Election Commission) షెడ్యూల్ రిలీజ్ చేసింది.
ఇక ఈసీ (Election Commission) రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 8 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలో ఒక స్థానిక సంస్థకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి (MLC Election Shedule) ఈసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.