హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish Rao: హరీశ్ రావుకు బిగ్ టార్గెట్ ఇచ్చిన కేసీఆర్.. ఎన్నికలకు కొన్ని నెలల ముందే..

Harish Rao: హరీశ్ రావుకు బిగ్ టార్గెట్ ఇచ్చిన కేసీఆర్.. ఎన్నికలకు కొన్ని నెలల ముందే..

కేసీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

కేసీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

TS Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. వైఎస్ షర్మిల పార్టీ, వామపక్షాలు, టీడీపీ ప్రభావం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు తగ్గట్టుగా అన్ని పార్టీలు వ్యూహాలు రచించుకుని ముందుకు సాగుతున్నాయి. బీజేపీకి ఆ పార్టీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేస్తుంటే.. రేవంత్ రెడ్డి పాదయాత్ర తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్‌(BRS) కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది. బీఆర్ఎస్‌లోని కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావు రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. కేసీఆర్ కొన్ని బహిరంగ సభలకు మాత్రమే పరిమితమవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా ఉన్న హరీశ్ రావు(Harish Rao) సేవలను ఈసారి ఎన్నికల్లో ఏ రకంగా వినియోగించుకోవాలనే దానిపై కేసీఆర్ ఓ క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది.

హరీశ్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారని.. ఈ మేరకు ఇప్పటికే హరీశ్ రావుకు సమాచారం కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మెజార్టీ స్థానాలు తీసుకురావడం హరీశ్ రావుకు పెద్ద కష్టమేమీ కాకపోయినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలుపు కోసం ట్రబుల్ షూటర్ ఏ విధంగా ముందుకు సాగుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2014 ఎన్నికలతో పాటు 2018 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క సీటు దక్కింది. ఆ తరువాత ఇతర పార్టీల్లోని వలస నేతలతో జిల్లాలో బీఆర్ఎస్ బలపడినట్టు కనిపిస్తున్నాయి.. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో బీఆర్ఎస్‌కు ఓ పెద్ద సవాల్ ఎదురుకానుంది. రాబోయే ఎన్నికల్లో తాను, తన వర్గాన్ని గెలిపించుకోవడంతోపాటు బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మాజీ ఎంపీ పొంగులేటి.

TSPSC పేపర్ లీక్ అయిందిలా..సిట్ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి..

Telangana Bjp: బండి సంజయ్ పై సొంత పార్టీ నేతల అసమ్మతి రాగాలు..షాక్ తప్పదా?

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. వైఎస్ షర్మిల పార్టీ, వామపక్షాలు, టీడీపీ ప్రభావం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. దీంతో ఇక్కడి బీఆర్ఎస్‌ గెలుపు బాధ్యతలను కేసీఆర్ హరీశ్ రావుకు అప్పగించారని సమాచారం. ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో.. ముందుగానే ట్రబుల్ షూటర్‌కు బాధ్యతలు ఇవ్వడం ద్వారా అక్కడ పరిస్థితిని అంచనా వేసి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై ఆయనకు అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మొత్తానికి బీఆర్ఎస్‌ను ఎన్నికల్లో గెలిపించడంతో కీలక పాత్ర పోషించే హరీశ్ రావు.. ఆ పార్టీకి ఎంతో కీలకంగా మారనున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ గెలుపు కోసం ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Harish Rao, Telangana

ఉత్తమ కథలు