హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kavitha: కవిత రాజకీయ లెక్కలు మారాయా ?.. ముందుగానే ఎన్నికల బరిలోకి..

Kavitha: కవిత రాజకీయ లెక్కలు మారాయా ?.. ముందుగానే ఎన్నికల బరిలోకి..

ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)

Telangana: 2014 ఎన్నికల్ల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కవిత.. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకోవడం కవిత కీలక పాత్ర పోషించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ సక్సెస్‌కు బ్రేక్ వేసేందుకు బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్(BRS) ముఖ్యనేతల్లో ఒకరిగా ఉన్న నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న అనేక మంది నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు. బీఆర్ఎస్ తరపున ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

2014 ఎన్నికల్ల్లో నిజామాబాద్ (Nizamabad) ఎంపీగా పోటీ చేసి గెలిచిన కవిత.. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకోవడం కవిత కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కవిత గెలవకలేకపోయారు. ఆ తరువాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన కవిత.. ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టారు. అయితే కవిత టార్గెట్ మళ్లీ నిజామాబాద్ ఎంపీ సీటు అనే చర్చ జరుగుతోంది. అయితే లోక్ సభ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. కవిత ముందుగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని బోధన్, జగిత్యాలలో(Jagtial) ఏదో ఒక స్థానం నుంచి కవిత పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో విపక్షాల నుంచి బీఆర్ఎస్ గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ నాయకత్వం.. కవితను ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో దింపడం వల్ల ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ముందుగా రాష్ట్రంలో విజయం సాధించిన తరువాత ఆ తరువాత లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉంటుందని.. అప్పుడు అవసరాన్ని బట్టి ఆమెను మరోసారి లోక్ సభ బరిలోకి దింపొచ్చని బీఆర్ఎస్ నాయకత్వం అనుకుంటున్నట్టు సమాచారం.

Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ సీనియర్లు దూరంగా ఉంటున్నారా ?

Kondagattu: హనుమాన్ భక్తులకు శుభవార్త.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు..!

కవిత సైతం ఈ మేరకు స్థానిక నేతలకు సంకేతాలు ఇస్తున్నారని.. పార్టీ నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తన పోటీ ఉంటుందని ఆమె చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయని.. కవితను పోటీలో విషయంలోనూ ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే అసెంబ్లీ లేదా లోక్ సభకు పోటీ చేసినా.. ఆమె రాజకీయాలు మాత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చుట్టూనే తిరిగే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

First published:

Tags: Kalvakuntla Kavitha, Telangana