కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణలో రాజకీయ విమర్శలు డైరెక్ట్‌గా ఎటాక్ చేసుకునే స్థాయి నుంచి సోషల్ మీడియా(Social media)లో కామెంట్స్ పెట్టుకునే వరకు వచ్చాయి. కాని ఇప్పుడు ఏకంగా రోడ్డెక్కాయి. పొలిటికల్‌గా సెటైర్లు వేయడానికి ఏకంగా పోస్టర్లను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలతో మూడు రకాల పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. బేగంపేట(Begumpet)లోని మెట్రో పిల్లర్లపై కవిత(Kavitha), కేసీఆర్(KCR)ఫోటోలతో ఉన్న పోస్టర్లు శనివారం(Saturday) తెల్లవారు జామునే ప్రత్యక్షమయ్యాయి. ఒక పోస్టర్‌లో కవిత అంటే పద్యం అనుకుంటిరా లే మద్యం అంటూ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ తుపాకీ పట్టుకున్న ఫోటోని కవిత ఫోటో మార్చి అంటించారు. మరో పోస్టర్‌లో కవితక్క నీక్కావాలి సారా దందాలో 33శాతం వాటా..దాని కోసమే ఆడుతున్నావు 33శాతం మహిళల రిజర్వేషన్ ఆట అంటూ విమర్శలు చేస్తున్న పోస్టర్లు వేశారు. వీటితో పాటు కల్వకుంట్ల దొంగల ముఠా కథ,స్క్రీన్ ప్లే,మాటలు, దర్శకత్వం కేసీఆర్ పేరుతో మరో పోస్టర్ వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇందులో సీఎం కేసీఆర్, కవిత, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఫోటోలను ముద్రించారు. విచిత్రం ఏమిటంటే ఈ పోస్టర్లపై ఎవరి పేరు, ఊరు లేకపోవడంతో పోలీసులు ఇదంతా ఎవరు చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పొలిటికల్ సెటైర్ పోస్టర్స్..
కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో ఆమెను విమర్శిస్తూ ఈ పోస్టర్లు ప్రత్యక్షం కావడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వాల్ పోస్టర్లపైనే తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకొని ఢిల్లీలో కవితక్క చేస్తోంది దొంగ సారా దందా అంటూ వాటిపై రాతలు రాసి ఉన్నాయి. పోస్టర్లు తొలగించిన పోలీసులు వీటిని ఎవరు అంటించారో తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌ని సేకరిస్తున్నారు.
గతంలో బీజేపీ నేతలపై..
తెలంగాణలో పొలిటికల్ పోస్టర్లు ప్రత్యక్షం కావడం కొత్తేది కాదు. రీసెంట్‌గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కుమార్ కనబడుట లేదని ఊరు, పేరు లేని పోస్టర్లు వెలిశాయి. అయితే ఇది బీఆర్ఎస్ శ్రేణుల పనిగా బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అంతకు ముందు మోదీ, అమిత్‌షా వంటి కేంద్ర పెద్దల పేర్లతో కూడా ఫ్లెక్సీలు, పోస్టర్లు హైదరాబాద్‌లో కనిపించాయి.
వీధికెక్కిన విమర్శలు ..
తెలంగాణలో పొలిటికల్ విమర్శలకు రోడ్లపై పోస్టర్లతో ఆగిపోతారా లేక అంతకు మించి ఏదైనా కొత్తగా ప్రయత్నించి ..ప్రజాప్రతినిధుల గౌరవాన్ని బజారుకీడుస్తారా అంటూ మేధావులు, విద్యావంతులు,నగరపౌరులు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.