హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: షర్మిలకు కడియం శ్రీహరి సూచన.. జగన్ జైలుకు వెళితే..

YS Sharmila: షర్మిలకు కడియం శ్రీహరి సూచన.. జగన్ జైలుకు వెళితే..

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila-Kadiyam Sri Hari: జగన్ జైలు కెళ్లినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని కడియం శ్రీహరి అన్నారు. షర్మిల, విజయలక్ష్మిని రాజకీయంగా జగన్ అన్యాయం చేశారని కామెంట్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల మాట్లాడటం బాధాకారమని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మొదటి నుంచి తెలంగాణకు వైఎస్ కుటుంబం వ్యతిరేకమని ఆరోపించారు. జగన్ జైలు కెళ్లినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. షర్మిల, విజయలక్ష్మిని రాజకీయంగా జగన్ అన్యాయం చేశారని కామెంట్ చేశారు. షర్మిల ఆంధ్రకు వెళ్లి ప్రజలకు మొర పెట్టుకోవాలని సూచించారు. రెపో మాపో జగన్ జైలుకు పోతే ఆమెకు అవకాశం వస్తుందని అన్నారు. ఇక్కడ తిరిగి సమయం వృధా చేసుకోవద్దని ఆమెకు సూచించారు.

ఇక తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కొత్త సీసాలో పాత సార పోసినట్లు బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు కొత్త సీసా తీసుకొని ఫామ్‌హౌజ్‌కి వెళ్లారని, అందులో కేసీఆర్ పాత సార పోశారని విమర్శించారు. బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని ఆరోపించారు. గత ఏడాది బడ్జెట్‌నే కాపీ పేస్ట్ చేశారని కామెంట్ చేశారు. చెత్తబుట్టలో పడేసేలా చేస్తున్నారని విమర్శించారు. గత బడ్జెట్ కేటాయింపులు మాదిరిగా ఈ సారి కూడా అంకెల గారడీని చూపించారని షర్మిల తెలిపారు.

రైతు రుణమాఫీ పథకానికి బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించడాన్ని షర్మిల తప్పుబట్టారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి రుణమాఫీ కావాలంటే రూ.19 వేల కోట్ల నిధులు కావాలని, కానీ బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. రూ.6 వేల కోట్లతో ఎంతమందికి రుణం మాఫీ చేస్తారని, రాష్ర్టంలో 25 లక్షల మంది రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు మీద సమాధానం చెప్పాలని.. కేటాయింపులకు ,ఖర్చులకు పొంతనే లేదని షర్మిల ఆరోపించారు.

Telangana New Secretariat: సెక్రెటేరియేట్ లో జరిగింది ప్రమాదమా లేక నరబలా? హైకోర్టులో KA పాల్ పిల్

Big News: ఎమ్మెల్యేల ఎర కేసు..ప్రభుత్వ పిటీషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా!

8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు విలువ ఉండదా..? అని ప్రశ్నించారు. సీఎం మాటలు మాత్రం కోటలు దాటుతాయి.చేతలు మాత్రం గడప దాటవని ఆరోపించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి కాలేదు. రైతు బందు అని రూ.10 వేలు ఇచ్చి అన్ని సబ్సిడీ పథకాలు బంద్ పెట్టారని దుయ్యబట్టారు. రూ.10 వేలతో రైతును రారాజు చేస్తే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

First published:

Tags: Telangana, YS Sharmila

ఉత్తమ కథలు