Home /News /telangana /

TS POLITICS BJP WORKING PRESIDENT JP NADDA KISHAN REDDY BANDI SANJAY AND OTHERS FIRES ON TRS AND CM KCR AK

కేసీఆర్‌కు ఏటీఎంగా మారిన కాళేశ్వరం.. దున్నపోతుకు గడ్డేస్తే ఆవు పాలిస్తుందా ?.. పాలమూరు సభలో బీజేపీ నేతలు

పాలమూరులో జేపీ నడ్డా, బండి సంజయ్

పాలమూరులో జేపీ నడ్డా, బండి సంజయ్

Telangana BJP: ఫామ్‌ హౌజ్‌లో ఉన్న ముఖ్యమంత్రికి ఎన్నికలంటే భయమేస్తోందని బీజేపీ ఎద్దేవా చేసింది. పుత్రవాత్సల్యంతో కేసీఆర్ కొట్టుమిట్టాడుతున్నారని.. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల చేతిలో తెలంగాణ తల్లి బందీ అయిందని ఆరోపించింది.

    తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన 'జనం గోస-బీజేపీ భరోసా' బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌‌ను తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజురాబాద్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సీఎం కేసీఆర్‌ ఏటీఎంగా మారిందని విమర్శించారు. మిషన్‌ భగీరథలో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

    తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. 5 సంవత్సరాలు పరిపాలించేందుకు కేసీఆర్‌కు ప్రజలు అవకాశం ఇస్తే... ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలను అవమనపర్చాడని విమర్శించారు. పాలమూరు గడ్డ నుంచి బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పాలమూరులో బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించారని గుర్తు చేశారు. పాలమూరుకు బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.

    ఫామ్‌ హౌజ్‌లో ఉన్న ముఖ్యమంత్రికి ఎన్నికలంటే భయమేస్తోందని ఎద్దేవా చేశారు. పుత్రవాత్సల్యంతో కేసీఆర్ కొట్టుమిట్టాడుతున్నారని.. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల చేతిలో తెలంగాణ తల్లి బందీ అయిందని అన్నారు. తెలంగాణ కేబినెట్‌లో ఉద్యమకారులు లేరని.. ఉద్యమ ద్రోహులు మాత్రమే ఉన్నారని విమర్శించారు. ఒవైసీ తలకిందులుగా తపస్సు చేసినా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను కాపాడలేరని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌ను బొందపెట్టబోతున్నారని అన్నారు.

    TS Politics: తెలంగాణ మాజీమంత్రి మళ్లీ డైలమాలో పడిపోయారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?

    Telangana: బండి సంజయ్‌తో మాజీ ఎంపీ భేటీ ? కాషాయ కండువా కప్పుకుంటారా ?

    ప్రజలు దున్నపోతుకు గడ్డేస్తే... ఆవు పాలిస్తుందా? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని బాదానం చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని.. వరి విషయంలో ఢిల్లీ వచ్చి డ్రామాలు చేశాడని.. గంటలో ధర్నా ముగించాడని ఎద్దేవా చేశారు. మరోసారి టీఆర్ఎస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కిషన్ రెడ్డి సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు