హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP Vijayashanti: తెలంగాణ బీజేపీలో కల్లోలం.. మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

BJP Vijayashanti: తెలంగాణ బీజేపీలో కల్లోలం.. మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

విజయశాంతి (ఫైల్ ఫోటో)

విజయశాంతి (ఫైల్ ఫోటో)

తెలంగాణ బీజేపీ నాయకత్వంపై మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత విజయ శాంతి సంచలన కామెంట్స్ చేశారు. తనను పక్కకు పెట్టారని ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ బీజేపీ  (Telangana BJP)లో కల్లోలం మొదలైంది. మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత విజయ శాంతి (Former MP Vijaya shanti) పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. తనను పక్కకు పెట్టారని ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ (BJP) నేతలనే అడగాలన్నారు. హైదరాబాద్‌లో (Hyderabad) సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న విజయశాంతి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తాను అసంతృప్తిగా ఉన్నానో లేదో రాష్ట్ర బీజేపీ నాయకత్వం వద్దే స్పష్టత తీసుకోవాలన్నారు. సర్వాయి పాపన్న జయంతి (Sarvai Papanna Jayanti) వేడుకల్లో మాట్లాడుదామనుకున్నానని ఐతే లక్ష్మణ్‌ వచ్చి మాట్లాడారని విజయశాంతి తెలిపారు. ఆయన వచ్చారు వెళ్లారని.. తనకేమి అర్థం కావడం లేదని ఆమె చెప్పారు.

నాకు బాధ్యతలేమీ అప్పగించలేదు..

ఇక రాష్ట్రంలో ఎక్కువగా మీడియా ముందుకు రాకపోవడం, బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..  రోజూ తిరగడానికి ఇదేమీ ఉద్యమం కాదన్నారు విజయశాంతి. తన సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాల్సి ఉందని విమర్శించారు. పార్టీ బాధ్యతలు ఇస్తే ఏమైనా చేయగలమని..ఏమి ఇవ్వకుండా చేయాలంటే ఇలా అని ప్రశ్నించారు. తన పాత్ర ఎప్పుడు టాప్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు.

Komatireddy: ‘‘మునుగోడులో ప్రచారానికొస్తా.. కానీ ఒక కండీషన్​ ’’: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

ఉద్యమ నేతగా ప్రజల్లో ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో పోరాడానని..తన పాత్ర ఎప్పుడు బాగానే ఉంటుందన్నారు. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బాగుంటుందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విజయ శాంతి వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో పుంజుకోవాలని అనుకుంటున్న సమయంలో నేతల మధ్య సమన్వయ లోపం బయటపడుతోంది.

బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని..

పార్టీ తనకు ఏమి బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని విజయశాంతి ప్రశ్నించారు. ఒకరిద్దరితో పార్టీలో పనులు జరగవన్నారు.ప్రజల సమస్యల పట్ల అవగాన ఉన్నవాళ్లను ముందులో వరసలో ఉంచాలని ఆమె నాయకత్వాన్ని కోరారు. బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనన్నారు. ఇవాళ మీడియా తో మాట్లాడుదామనే వచ్చానని తెలిపారు. పార్టీ తనను ఉపయోగించుకోవడం లేదనే భావిస్తున్నానని విజయశాంతి కుండబద్దలు కొట్టారు. మీకు వచ్చిన అనుమానాలను బండి సంజయ్ ని అడిగితే బాగుంటుందని ఆమె మీడియా ప్రతినిధులకు సూచించారు. పార్టీలో ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని ఆమె చెప్పారు.

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఉపఎన్నికల్లో (Munugode Bypolls) గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ రచనలో బిజీగా ఉన్నాయి. పోటా పోటీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఈ నెల 20న భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఆ సభ వేదికగా మునుగోడుపై సీఎం కేసీఆర్ (CM KCR) వరాలు జల్లు కురిపించే అవకాశముంది. అలాగే అభ్యర్థిపైనా ప్రకటన చేస్తారు. ఆ మరుసటి రోజే బీజేపీ సభ జరగనుంది. ఆగస్టు 21నే సభను నిర్వహించనున్నారు. ఆ సభా వేదికగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy RajagopalReddy) తో పాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరనన్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు.

First published:

Tags: Telangana bjp, Vijayashanti

ఉత్తమ కథలు