హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana | Amit Shah: తెలంగాణలో అడుగుపెట్టిన అమిత్‌షా .. పార్టీ కార్యకర్త ఇంట్లో కేంద్ర హోంమంత్రికి టీ పార్టీ

Telangana | Amit Shah: తెలంగాణలో అడుగుపెట్టిన అమిత్‌షా .. పార్టీ కార్యకర్త ఇంట్లో కేంద్ర హోంమంత్రికి టీ పార్టీ

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Telangana | Amit Shah: తెలంగాణలో బీజేపీ అడుగులు, పార్టీ హైమాండ్‌ ఆలోచనలు, నేతల పర్యటనలు పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ని నింపుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీలకు అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా ఉపఎన్నికల విషయానికి వస్తే మిగిలిన పార్టీల కంటే కమలనాథులు మరింత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణులతో పాటు కింది స్థాయి కార్యకర్తలను కలుపుకుపోతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ(Telangana)లో బీజేపీ (BJP)అడుగులు, పార్టీ హైమాండ్‌ ఆలోచనలు, నేతల పర్యటనలు పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ని నింపుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీలకు అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా ఉపఎన్నికల విషయానికి వస్తే మిగిలిన పార్టీల కంటే కమలనాథులు మరింత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణులతో పాటు కింది స్థాయి కార్యకర్తలను కలుపుకుపోతున్నారు. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా (Amit Shah)ఆదివారం(Sunday)తెలంగాణ పర్యటన కూడా అదే తరహాలో కొనసాగుతోంది. మునుగోడు(Munugodu)బైపోల్‌ జరుగుతున్న నేపధ్యంలో ఆయన హైదరాబాద్‌ (Hyderabad)చేరుకున్నారు. బహిరంగసభకు ముందే సికింద్రాబాద్‌ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. కమలం పార్టీకి చెందిన జాతీయస్థాయి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి పర్యటనలో ఇంకో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో గత మూడు దశాబ్ధాలుగా పనిచేస్తున్న ఓ దళిత నేత (Dalit Leader)ఇంట్లో కాఫీ తాగి వారి సామాజికవర్గంలో ఉన్న సమస్యలు పార్టీలోని ఇతర విషయాలపై చర్చించనున్నారు.

Munugodu: తెలంగాణ రాజకీయాల్లో మరో ట్విస్ట్​.. మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంకాగాంధీ ఫోకస్​.. దళితనేత ఇంట్లో అమిత్‌షా టీ పార్టీ ...

తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనతో బీజేపీ అగ్రనాయకత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఉపఎన్నికల్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీ నేతలు మునుగోడు బైపోల్‌ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం మునుగోడులో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణలో అడుగుపెట్టారు. మునుగోడుతో పాటు పార్టీ శ్రేణుల్ని ఉత్తేజ పరిచేందుకు ఆయన ముందుగా సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బన్సిలాల్‌పేట డివిజన్‌కి చెందిన బీజేపీ నాయకుడు సత్యనారాయణ ఇంట్లో టీ తాగి స్నాక్స్‌ స్వీకరించారు.

షా వ్యూహాలు...

పార్టీ అగ్రస్థాయినేత బస్తీలోని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లడంతో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అమిత్‌షా తమ ఇంటికి వస్తుండటంపై సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. గత 30ఏళ్లుగా బీజేపీలో కార్యకర్తగా పని చేస్తున్నానని..తన ఇంటికి అమిత్‌షా వస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. అమిత్‌షా కోసం బ్లాక్ కాఫీతో పాటు మూడు రకాల టీలు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ సిద్ధంగా ఉంచామన్నారు దళితనేత సత్యనారాయణ.

3 Lakhs for House: తెలంగాణ ప్రజలకు గుడ్​న్యూస్​.. ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి త్వరలో రూ. 3 లక్షలు.. అన్నీ వర్గాలను కలుపుకుపోయేలా..

బీజేపీ అగ్రనేత షా దళిత కార్యకర్త ఇంట్లో టీ తాగిన తర్వాత అతని కుటుంబ సభ్యులతో ముచ్చటించి మునుగోడు బయల్దేరారు. అక్కడే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. అటుపై రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీని అధికారంలోకి తెస్తే రాష్ట్రానికి చేసే పనులపై ప్రజలకు వివరిస్తూ ప్రసంగిస్తారు అమిత్‌షా. అమిత్‌షా టూర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు గ్రేటర్ నాయకులు, రాష్ట్రానికి చెందిన బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

బీజేపీతోనే దళితులకు న్యాయం..

ఇచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే తెలంగాణలో దళితులకు మేలు జరుగుతుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన బిజెపి దళిత కార్యకర్త ఎన్.సత్యనారాయణ.

First published:

Tags: Amit Shah, Bjp, Munugode Bypoll

ఉత్తమ కథలు