Home /News /telangana /

TS POLITICS BJP TELANGANA STATE PRESIDENT BANDI SANJAY ALLEGED THAT ANARCHY WAS IN THE TRS REGIME IN THE SAME WAY AS IT WAS IN THE NIZAM REGIME IN TELANGANA PRV

Bandi Sanjay: నిజాం పాలనలో అరాచకాలన్నీ.. ఈ టీఆర్​ఎస్​ పాలనలో కనిపిస్తున్నాయి.. కేసీఆర్​పై బండి సంజయ్​ ధ్వజం

బండి సంజయ్​, సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

బండి సంజయ్​, సీఎం కేసీఆర్​ (ఫైల్​ ఫొటో)

తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలనలో అరాచకాలు ఎలా ఉండేవో అదే తరహలో అరాచకాలు టీఆర్​ఎస్​ పాలనలో ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

    తెలంగాణ (Telangana) రాష్ట్రంలో నిజాం పాలన (Nizam regime)లో అరాచకాలు (anarchy) ఎలా ఉండేవో అదే తరహలో అరాచకాలు టీఆర్​ఎస్​ పాలన (TRS regime)లో ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Telangana state president Bandi Sanjay) ఆరోపించారు.  సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై సీబీఐ విచారణ జరిపించి తమ తప్పును రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలని కోరారు. తప్పు చేస్తున్న టీఆర్ఎస్ (TRS) నేతలను వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. గణేష్ మరణానికి కారణమైన వారికి శిక్ష పడేవరకు పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ (CM KCR)పై బండి సంజయ్​ ధ్వజమెత్తారు.  ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత సాయి గణేశ్​ (Sai Ganesh) ఆత్మహత్యకు నిరసనగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. అదేవిధంగా ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) నిర్వహిస్తున్న బండి సంజయ్  నిరసన దీక్షలో పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal District ) జిల్లాలోని మల్ధకల్ లో ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద బండి సంజయ్​ (Bandi Sanjay,) బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) సహా పలువురు ఆ పార్టీ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు.

    రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు..

    ఖమ్మం (Khammam )లో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి టీఆర్ఎస్ నేతలే కారణమని బండి సంజయ్​ ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్​వేధింపులకు పాల్పడ్డారని బండి అన్నారు. సాయి గణేష్ పై 16 కేసులు నమోదు చేయించారని సంజయ్​ ధ్వజమెత్తారు. అంతేకాదు సాయి గణేష్ పై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు. దీంతో సాయి గణేష్ ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగాడన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ మరణించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    ఎక్కడ ఏం జరిగినా వాళ్ల పేర్లే..

    తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా కూడా టీఆర్ఎస్ నేతల పేర్లే బయటకు వస్తున్నాయని బండి సంజయ్​ చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాల కేసుల్లో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సాయి గణేష్ మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టుగా మీడియాకు చెప్పారని బండి అన్నారు. కానీ సాయి గణేష్ నుంచి పోలీసులు మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని బండి సంజయ్​ ప్రశ్నించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, CM KCR, Khammam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు