TS POLITICS BJP TELANGANA PRESIDENT BANDI SANJAY WILL HOLD A HUGE PUBLIC MEETING IN JOGULAMBA GADWALA DISTRICT TODAY AS PART OF A PRAJASANGRAMA YATRA PRV
Bjp Gadwal meeting: నేడు గద్వాలలో బీజేపీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి.. సభకు ఎవరెవరు రానున్నారంటే..?
బండి సంజయ్ (పైల్ ఫోటో )
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశారు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Telangana president Bandi Sanjay') ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama Yatra)లో భాగంగా గురువారం రాత్రి జోగులాంబ గద్వాల (Gadwal)జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో భారీ బహిరంగ సభ (Open meeting)ను నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వారం రోజులుగా సాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుండటంతో బహిరంగ సభను సైతం అదే స్థాయిలో నిర్వహించేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ (DK Aruna) కంకణం కట్టుకున్నారు. ఈ సభ విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు (Tamilnadu) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajnedhar) తదితరులు హాజరు కానున్నారు.
బీజేపీ (BJP) పట్ల రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, బండి సంజయ్, ఈటల రాజేందర్ల కు ప్రజల్లో ఉన్న అభిమానం, అన్నింటికీ మించి డీకే అరుణ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గం కావడంతో అందరూ.. ఈ కార్యక్రమం వైపు దృష్టి సారిస్తున్నారు. కాగా బుధవారం తేరు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను డీకే అరుణ, ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి వెంకట్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు.
అవినీతి, నియంత, కుటుంబ పాలన నిర్మూలనే లక్ష్యంగా..
మొదటి దశ ప్రజా సంగ్రామయాత్ర (First Phase Praja sangrama Yatra) ను పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్ ప్రారంభించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన జోగులాంబ ఆలయం (Jogulamba Temple) నుంచి రెండో దశ యాత్ర ప్రారంభం అయింది. అవినీతి, నియంత, కుటుంబ పాలన నిర్మూలనే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్టు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. వేసవి కావడంతో ఇబ్బందులు తలెత్తకుండా అందుకు తగిన ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటూ అవమానించడంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. అందుకే అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు బండి.
31 రోజుల పాటు 386 కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. ఐదు జిల్లాలు, మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు, 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Second Phase Praja sangrama Yatra) జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఆలంపూర్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, మక్తల్, జడ్చర్ల, దేవరకద్ర, కల్వకుర్తి, మహేశ్వరం నియోజకవర్గాల వారీగా సాగనుంది. కేసీఆర్ సర్కారు అవినీతి, నియంత, కుటుంబ పాలనను ప్రజల్లో ఎండగట్టటమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర చేపడుతున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.