బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (Etala Rajender)శాసన సభ సమావేశాల(Telangana assembly) నుంచి సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా తప్పు పట్టింది. కేవలం ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేమనే భయం కేసీఆర్‌లో ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay). అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivas Reddy)ని ఈటల రాజేందర్ మర మనిషి అంటేనే మీకు అంత కోపం వస్తే అసెంబ్లీలోనే దేశ ప్రధాన మంత్రిని ఫాసిస్ట్ ప్రధాని అని కేసీఆర్(kcr) వ్యాఖ్యానించిన కేసీఆర్‌ని ఏం చేయాలని ప్రశ్నించారు. ఈటల వ్యాఖ్యలను తప్పుపడుతూ సస్పెండ్ చేస్తే ... ప్రధానిని అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కూడా సభ నిర్వహించడానికి కాదు కనీసం సభలో ఉండటానికి కూడా అర్హులు కాదని మండిపడ్డారు బండి సంజయ్. దేశ ప్రధానిని అగౌరవపరుస్తూ అసెంబ్లీలో మాట్లాడినందుకు కేసీఆర్ సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లే అర్హత కూడా లేదని బండి సంజయ్ మండిపడ్డారు.
మీరు ప్రధానిపై ఆ వ్యాఖ్యలు చేయవచ్చా...
బహిరంగ సభలు మొదల్కొని అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమి తెలియదన్నారు. ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేసిన అంశంపై లీగల్‌గా ఫైట్ చేస్తామన్నారు. కేసీఆర్‌ను కూడా తెలంగాణ నుంచి సస్పెండ్ చేసే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు. అతి త్వరలోనే సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కుత్బుల్లాపూర్ ప్రజాసంగ్రామయాత్రలో ఉన్న బండి సంజయ్ అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేసిన అంశంపై ఘాటుగా స్పందించారు.
లీగల్‌గా చూసుకుంటాం..
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేని కేసీఆర్ ..ప్రతిపక్ష ఎమ్మెల్యేలపైన కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు మాత్రం చేస్తారని మండిపడ్డారు బండి సంజయ్ . కొత్త ఫించన్లు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ పాత ఫించన్ దారులకే రెండు నెలలు ఇస్తూ మధ్యలో ఎగనామం పెడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్. ఇప్పుడు కూడా మునుగోడు ఉపఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారని ...అవి అయిపోగానే మళ్లీ కొత్త ఫించన్లు కూడా ఎగనామం పెడతారని విమర్శించారు బండి సంజయ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Telangana Politics, Ts assembly sessions