5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (5 state assembly elections Results) బీజేపీకీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. బీజేపీ (BJP)కి వ్యతిరేకత పెరుగుతోందని వస్తున్న వార్తలను తలకిందులు చేసింది. ఉత్తరాదిన ఆ పార్టీకి తిరుగులేదని అర్థమైపోయింది. ఇప్పుడు ఆ పార్టీ దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP).. ఇతర రాష్ట్రాల్లోనూ తనదైన ముద్ర వేయడానికిచాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో మరింత అడుగు ముందుకేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాల్లో ఫైర్ కనిపించే అవకాశం ఉంది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Telangana BJP Chief Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అధికారం సొంతం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ ఫలితాలు ముందుగా ఊహించినదేనని ఆయన వెల్లడించారు. కొన్ని సర్వే సంస్థలు, మీడియా ప్రతినిధులు యూపీ ఎన్నికల (UP Elections) తర్వాత బీజేపీ పనైపోతుందని ప్రచారం చేశారని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కావాలని అక్కడి ప్రజలు ఆశించారని పేర్కొన్నారు.
ఇప్పటికే ఫోకస్ పెట్టినం..
బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ (Telangana politics)పై ఇప్పటికే ఫోకస్ పెట్టిందని బండి సంజయ్ అన్నారు. అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP government) సహకరించడం లేదని తమను టీఆర్ఎస్ బద్నాం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు (People) గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ (CM KCR) చేస్తున్న పర్యటనలు కేవలం విహార యాత్రలుగా మిగిలిపోయాయని.. సీఎం పర్యటనలతో ఒరిగేదేమీ ఉండదని బండి సంజయ్ చురకలు వేశారు.
యూపీలో ఎందుకు గెలిచామంటే..?
కేసీఆర్ చెల్లని రూపాయి అన్న ఆయన రేపు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమన్నారు. అవినీతి రహిత పాలనతో పాటు గూండా రాజ్యాలను కూకటివేళ్ళతో పెకిలించాం కాబట్టే… యూపీలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బండి సంజయ్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలవడమే కాదు… ఓటింగ్ శాతం కూడా పెరిగిందని ఆయన గుర్తుచేశారు. ఇంజన్ లేని బండి నడవదని.. తెలంగాణలో ఇంజిన్ దారూసలేంలో ఉందని బండి విమర్శలు చేశారు. నోటిఫికేషన్లపై కోర్టులకు వెళ్ళమని.. ఎవ్వరు వెళ్లినా కఠినంగా వ్యవహరించాలన్నారు. అసెంబ్లీ లో కేటీఆర్ చేసిన కామెంట్స్ పట్టించుకోమన్నారు. అభ్యర్థులు పరీక్షలు రాసి… ఉద్యోగ నియామక పత్రాలు అందుకునేవరకు ఎన్నికలకు వెళ్ళను అని కేసీఆర్ హామీ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, Bandi sanjay, Telangana, Telangana bjp