హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS Versus BJP: కవిత టార్గెట్‌గా టీఆర్ఎస్‌తో బీజేపీ మైండ్ గేమ్.. ఆ నేత ట్వీట్‌తో క్లారిటీ ?

TRS Versus BJP: కవిత టార్గెట్‌గా టీఆర్ఎస్‌తో బీజేపీ మైండ్ గేమ్.. ఆ నేత ట్వీట్‌తో క్లారిటీ ?

ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)

TRS Versus BJP: ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ అంశాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తూనే ఉన్నారు. తాజాగా తాజాగా ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ రచ్చకు కారణమైంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజకీయాల్లో ప్రత్యర్థులను మైండ్ గేమ్‌తో ఇబ్బందిపెట్టడం కూడా ఓ భాగమే. చాలామంది నేతలు, పార్టీలు తమ ప్రత్యర్థులను ఈ రకంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ రకంగా చేయడం వల్ల నేతలు ఇబ్బందిపడటంతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఆందోళనలోకి వెళ్లిపోతుంటాయి. తాజాగా తెలంగాణలో బీజేపీ కూడా ఇదే రకమైన మైండ్ గేమ్‌ను టీఆర్ఎస్‌పై ప్రయోగిస్తున్నట్టు కనిపిస్తోంది. దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో(Delhi Liquor Scam) టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత (Kalvakuntla Kavitha) కూడా ఉన్నారని గతంలో బీజేపీ ఎంపీ ఒకరు ఆరోపించారు. దీనిపై టీఆర్ఎస్ కూడా అంతే గట్టిగా రియాక్ట్ అయ్యింది. కేవలం ఆరోపణలతో కవితను, టీఆర్ఎస్‌ను ఇబ్బందిపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గులాబీ పార్టీ నేతలు ధ్వజమెత్తారు.అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ అంశాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తూనే ఉన్నారు. తాజాగా తాజాగా ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) చేసిన ట్వీట్ రాజకీయ రచ్చకు కారణమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ట్వీట్ చేసిన రాజగోపాల్ రెడ్డి.. కవితను ఉద్దేశించి తీవ్రమైన కామెంట్లు చేశారు. ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఎక్కడ జరుగుతాయి.. కవిత బతుకమ్మ ఎక్కడ ఆడుతారు, ఈడి ఆఫీసా, సిబిఐ ఆఫీసా లేక తీహార్ జైల్లోనా అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. కవితను టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ పై నెటిజన్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు స్పందిస్తున్నారు.


  తెలంగాణ పండుగను అవమానపరచిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మను అవమానించడమంటే తెలంగాణ ఆడపడుచులను అవమానించినట్టేనని ఫైరవుతున్నారు. అయితే బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ను ఇబ్బందిపెట్టేందుకు కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారాన్ని చేపట్టారని.. ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. కవిత ఇబ్బందుల్లో పడుతుందనే ప్రచారం ప్రజల్లోకి వెళితే.. ఆ ప్రభావం టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద ఉంటుందనే భావనలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోంది.
  Jagga Reddy: జగ్గారెడ్డి అలాంటి ప్లాన్ చేస్తున్నారా ?.. హైకమాండ్ ఒప్పుకుంటుందా ?
  Governor Tamilisai: నన్ను అవమానించారు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై​ సంచలన వ్యాఖ్యలు
  అయితే టీఆర్ఎస్ అధినాయకత్వం మాత్రం బీజేపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఇలాంటి వాటికి అతిగా స్పందించడం ద్వారా.. అనవసరంగా డిఫెన్స్‌లో పడిపోతామనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందని తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్‌ను ఇబ్బందిపెట్టేందుకు బీజేపీ కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారాన్ని ఎక్కువగా వినియోగించుకుంటోందనే అంశం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌తో స్పష్టమవుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Kalvakuntla Kavitha, Telangana, Trs

  ఉత్తమ కథలు