Home /News /telangana /

TS POLITICS BJP STATE PRESIDENT BANDI SANJAY HELD A SILENT PROTEST IN KARIMNAGAR AGAINST THE RULE OF THE TRS GOVERNMENT SNR KNR

Telangana : కుర్చితో బండి సంజయ్‌ మౌనదీక్ష .. కుర్చి వేయడానికి మతలబేంటో తెలిస్తే షాక్ అవుతారు

(కుర్చితో మౌనదీక ఎందుకో)

(కుర్చితో మౌనదీక ఎందుకో)

BJP vs TRS: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య పాలనపరమైన అంశాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల విషయంలోనే రాజకీయ యుద్ధం జరుగుతోంది. మోదీకి పాలించడం చేతకావడం లేదని కేసీఆర్ అంటే ..మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందంటూ బీజేపీ నేతలు మౌనదీక్షకు దిగారు.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    తెలంగాణ(Telangana)లో టీఆర్ఎస్, బీజేపీ(bjp) నాయకుల మధ్య పాలనపరమైన అంశాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల విషయంలోనే రాజకీయ యుద్ధం జరుగుతోంది. కేంద్రంలో చేతకాని ప్రభుత్వం ఉందంటూ సీఎం కేసీఆర్ (kcr) ప్రధాని మోదీ((modi)ని విమర్శిస్తుంటే ..ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నేతలు తెలంగాణలో అధికారం రాగానే గిరిజనుడ్ని సీఎం చేస్తానని చెప్పి ఆ కుర్చిలో కూర్చొని గిరిజన, ఆదివాసీల భూములు లాక్కుంటున్నారని బీజేపీ నిరసన తెలుపుతోంది. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మౌనదీక్ష(silent protest ) పేరుతో రెండు గంటల పాటు కరీంనగర్‌(Karimnagar)లో బీజేపీ తీరును ఎండగడుతున్నారు.

    కేసీఆర్‌కి బండి కౌంటర్‌..
    తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ టీఆర్ఎస్‌ పాలన, కేసీఆర్‌ మోసపూరిత వాగ్ధానాలు చేశారని విమర్శిస్తూ సోమవారం రెండు గంటల పాటు మౌనదీక్షకు దిగారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా , ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలనో ప్రధాన డిమాండ్‌తో 2 గంటల పాటు మౌన దీక్ష చేపట్టారు. కరీంనగర్‌లోని వరలక్ష్మీ గార్డెన్‌లో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు మౌనదీక్షలో కూర్చున్నారు. బండి సంజయ్‌తో పాటు జిల్లాకు చెందిన బీజేపీ శ్రేణులు సైతం ఈ మౌనదీక్షలు కూర్చున్నారు.



    మౌనదీక్ష..
    సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన జన్మదినం ఉన్నప్పటికి వాటిని నిర్వహించుకోకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ తరహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తన జన్మదిన వేడుకలను నిర్వహించకోకుండా నిరసన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సరం వేడుకల సందర్భంగా సంజయ్ ఏడు సెగ్మెంట్ల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలను అందించారు. ఈ సారి మాత్రం రైతాంగ సమస్యలను ప్రధాన అంశంగా తీసుకుని మౌన దీక్ష చేపట్టారు.

    KCR కుటుంబంలోనే ఏక్‌నాథ్ షిండేలు : BJP బండి తాజా బాంబు -జోగులాంబను సీఎం అవమానించారంటూ..

    కరీంనగర్‌లో మళ్లీ దీక్ష..
    గతంలో కూడా దుబ్బాక బై ఎలక్షన్‌లో పోలీసుల ప్రవర్తన తీరును తప్పుపడుతూ బండి సంజయ్ 24 గంటల పాటు కరీంనగర్ బిజెపి ఆఫీస్‌లో 24 గంటల పాటు మౌన దీక్షకు దిగడం సంచలనంగా మారింది. అప్పుడే బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు . అలా చేయడంవల్ల వలన బండి సంజయ్ ఆరోగ్యం పాడవుతుందని పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆఫీస్ తాళాలు పగలగొట్టి బండి సంజయ్ ని ఆసుపత్రికి తరలించారు. ఈసారి కేవలం రైతుల కోసం గిరిజనులు పోడు భూముల కోసం పుట్టినరోజు సందర్భంగా మౌన దీక్షలో కూర్చొని మరోసారి హాట్‌ టాపిక్‌గా మారారు.

    CM KCR | BJP : అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ సవాలుతో బీజేపీ ఇరుకున పడిందా?


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Bandi sanjay, Bjp, CM KCR, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు