Home /News /telangana /

TS POLITICS BJP SLAMS TRS AND KCR REGARDING RAJYA SABHA CONTESTANTS FROM TELANGANA AK

BJP Versus KCR: కేసీఆర్ నిర్ణయం.. విపక్షాలకు సరికొత్త ఆయుధం.. బీజేపీ వ్యూహం

కేసీఆర్, అమిత్ షా (పైల్ ఫోటో)

కేసీఆర్, అమిత్ షా (పైల్ ఫోటో)

TRS Versus BJP: భవిష్యత్తు కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసమే సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేశారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది.

    తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. విపక్షాలను ఇరుకున పెట్టే విధంగా ఉంటాయి. అందుకే ఆయన నిర్ణయాలను ప్రశ్నించిన విపక్షాలను ఆ తరువాత తనదైన శైలిలో ఇరుకునపడేస్తుంటారు కేసీఆర్(KCR). అయితే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలు సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్‌కు (TRS) దక్కాయి. దీంతో ఆ మూడు స్థానాల కోసం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారా ? అని అంతా ఎదురుచూశారు. దీనిపై సుదీర్ఘమైన కసరత్తు చేసిన కేసీఆర్.. ఈ స్థానాల కోసం పారిశ్రామికవేత్త పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, గాయిత్రి విద్యాసంస్థ అధినేత వద్దిరాజు రవిచంద్రలను ఎంపిక చేశారు.

    అయితే టీఆర్ఎస్ అధినేత చేసిన ఈ ఎంపికపై విపక్ష బీజేపీ (BJP) విమర్శలు గుప్పిస్తోంది. ఈ ముగ్గురు నేతలు ఆర్థికంగా బలమైన వాళ్లు కావడం.. తెలంగాణ ఉద్యమంలో వీళ్లెవరూ పెద్దగా పాల్గొన్న వాళ్లు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అంశాన్ని బీజేపీ లేవనెత్తింది. ఈ పదవులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌కు ఉద్యమకారులు ఎవరూ దొరకలేదా ? అని ప్రశ్నించింది.

    భవిష్యత్తు కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసమే సీఎం కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పెద్దగా స్పందించకపోయిప్పటికీ.. ఆ పార్టీ కూడా ఇదే రకమైన విమర్శలు గుప్పించి టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంటాయి.

    Rahul Gandhi| Revanth Reddy: రాహుల్ గాంధీ నిర్ణయం.. ఆ విషయంలో రేవంత్ రెడ్డి ప్లాన్ మారనుందా ?

    Ponguleti Srinivas Reddy: పొంగులేటికి రాజ్యసభ సీటు అందుకే రాలేదా? మాజీ ఎంపీ ఆ రకమైన ఆలోచనతో ఉన్నారా ?

    అయితే తెలంగాణలో టీఆర్ఎస్‌ను గట్టిగా టార్గెట్ చేయాలని డిసైడయిన బీజేపీ.. ఈ విషయంలో తమకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే రాజ్యసభ సభ్యుల ఎంపిక అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. టీఆర్ఎస్‌లో పదవుల పంపకం విషయంలో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదనే అంశాన్ని ప్రచారం చేయాలని భావిస్తోంది. మరి.. తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అంశంపై ప్రశ్నలు సంధిస్తున్న విపక్షాలకు టీఆర్ఎస్ ఏ రకంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు