హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Political News: ఖమ్మం సభ రోజే కేసీఆర్ కు షాక్ తప్పదా? 18న బీజేపీలోకి పొంగులేటి చేరిక ఖాయమా?

Telangana Political News: ఖమ్మం సభ రోజే కేసీఆర్ కు షాక్ తప్పదా? 18న బీజేపీలోకి పొంగులేటి చేరిక ఖాయమా?

సీఎం కేసీఆర్ (File Photo)

సీఎం కేసీఆర్ (File Photo)

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఖమ్మం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే జిల్లాలో అంతగా పట్టు లేని బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. 2014, 2018 ఎన్నికల్లో అధికార పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితం అయింది. ఆది నుంచి పార్టీకి బలం లేకపోయింది. పేరున్న నాయకులు పార్టీలో చేరినా కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక ఈ అవకాశాన్ని బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖరారు అయింది. ఆయనతో బీజేపీ హైకమాండ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈనెల 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పొంగులేటి భేటీ కూడా ఖరారు అయింది. అయితే అదే రోజు ఆయన పార్టీ మార్పుపై అధికారిక ప్రకటన చేస్తారా? ఖమ్మం బహిరంగ సభ రోజే కేసీఆర్ కు షాకిచ్చేందుకు పొంగులేటి నిర్ణయించుకున్నారా? అనే విషయాలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Khammam

Telangana High Court: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం..రైతుల పిటీషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

18 అమిత్ షాతో పొంగులేటి భేటీ..అదే రోజు చేరిక?

కాగా ఈనెల 18న బీజేపీ అగ్రనేత అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. అయితే ఆ భేటీలో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు అనుచరులకు టికెట్లు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. అయితే బీజేపీకి కూడా ఖమ్మంలో చెప్పుకోదగ్గ నాయకులు లేకపోవడంతో పొంగులేటి ప్రతిపాదనను బీజేపీ అంగీకరిస్తుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే అదే రోజు పొంగులేటి బీజేపీ గూటికి చేరనున్నట్టు తెలుస్తుంది.లేదా ఆ మరుసటి రోజు ప్రధాని హైదరాబాద్ రానున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పొంగులేటి కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి మాజీ ఎంపీ పొంగులేటి అమిత్ షా భేటీ రోజే బీజేపీలో చేరి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

KCR-Khammam: బీఆర్ఎస్‌లో ఆ ముఖ్యనేత పరిస్థితి ఏంటి.. నేటి కేసీఆర్ భేటీతో తేలిపోనుందా ?

నేటి నుంచి పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు?

పార్టీ మారాలని ధృడంగా నిర్ణయించుకున్న పొంగులేటి అమిత్ షాతో భేటీకి ముందు కార్యకర్తలు, అనుచరులతో కలిసి నేటి నుంచి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనాల్లో వారు అభిప్రాయాలను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలి? కేడర్ పరిస్థితిపై పొంగులేటి ఆరా తీయనున్నారు.

ఫిబ్రవరిలో పొంగులేటి భారీ సభ?

కాగా పార్టీ మారిన తరువాత ఫిబ్రవరిలోనే పొంగులేటి భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సభ ద్వారా తన బలం, బలగాన్ని చూపించాలని మాజీ ఎంపీ భావిస్తున్నట్టు సమాచారం.

First published:

Tags: Amit Shah, Bjp, BRS, Hyderabad, Khammam, Ponguleti srinivas reddy, Telangana, Telangana News

ఉత్తమ కథలు