Home /News /telangana /

TS POLITICS BJP SENIOR LEADER AND UNION HOME MINISTER AMIT SHAH WILL ARRIVE IN TELANGANA IN TWO DAYS AND HIS VISIT HAS ALSO BEEN FINALIZED PRV

Amit shah Telangana tour: రెండు రోజుల్లో తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్​షా.. పర్యటన షెడ్యూల్​ ఇదే..

అమిత్​ షా

అమిత్​ షా

తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికార టీఆర్​ఎస్​ వైఫల్యాలను ఎండగడుతోంది. టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఇక నేరుగా బీజేపీ అగ్రనేత తెలంగాణలో రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన కూడా ఖరారైంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో (Telangana) ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికార టీఆర్​ఎస్ (TRS)​ వైఫల్యాలను ఎండగడుతోంది. టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణలో బలపడటానికి బీజేపీ చీఫ్​ బండి సంజయ్ (Bandi sanjay) ​ కూడా ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. గ్రామ గ్రామాలు తిరిగి టీఆర్​ఎస్​పై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులకు అండగా బీజేపీ సీనియర్​ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (BJP senior leader and Union Home Minister Amit Shah) ఈ నెల 14న తెలంగాణ  (Telangana tour)కు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్ షా రానున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను అమిత్ షా సందర్శించనున్నారు.  సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు అమిత్ షా రానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడా సభాస్థలిలో జరగనున్న బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) ముగింపు సభకు  హోంమంత్రి చేరుకుంటారు. అదే రోజు రాత్రి 8.25 గంటలకు అమిత్ షా (Amit shah)ఢిల్లీకి బయల్దేరి వెళతారు.

    ప్రజల కోసం పోరాడేందుకు పాదయాత్ర..

    బండి సంజయ్ (Bandi sanjay) ఏప్రిల్ 14న తన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) ను చేపట్టిన సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఉద్యోగాలు, సాగునీరు, రైతులకు రుణ మాఫీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల కోసం పోరాడేందుకు బండి సంజయ్​ తన పాదయాత్రను చేపట్టారని వారు తెలిపారు.

    మహేశ్వరంలో ముగింపు..

    పాలమూరు (Mahbubnagar) జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) మే 14న మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సభకు అమిత్ షా రానున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై కేంద్రం, బీజేపీ రాజకీయ పోరాటం తీవ్రమవుతున్న తరుణంలో అమిత్ షా (Amit shah) రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పర్యటనలో ఆయన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శల చేస్తారు ? ఇందుకు గులాబీ బాస్ కేసీఆర్(KCR) నుంచి ఏ రకమైన రియాక్షన్ ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

    పాదయాత్రలో ఫైర్​..

    కాగా, పాలమూరులో పర్యటిస్తున్న బండి సంజయ్​ కేసీఆర్​ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.  తెలంగాణ (Telangana) వస్తే యువతకు ఉద్యోగాలు (Jobs) రాలేదని, పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. ఒక్క కేసీఆర్ (Cm KCR)​ కుటుంబంలోనే ముఖ్యమంత్రి తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ కూతురు కవిత అల్లుడు హరీశ్ రావు అదేవిధంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కు నెలకు ఐదు లక్షల జీతం మాత్రం వస్తోందని, ప్రజలకు ఏమైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రాత్రింబవళ్లు ఫామ్ హౌజ్ లో కేసీఆర్ మద్యం సేవిస్తూ పాలనను మరిచిపోయారని ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం రోడ్ల పై పడి మొరుగుతున్నాడని తీవ్ర పదజాలం ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటంబం అందరూ కలిసి దోచుకుని వాటిని విదేశీ బ్యాంకుల్లో జమ చేస్తున్నారని ఆరోపించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Amit Shah, Telangana bjp, Telangana Politics

    తదుపరి వార్తలు