హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP: తెలంగాణలో బెంగాల్ ఫార్ములా.. అమిత్ షా వ్యూహం.. రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు ?

BJP: తెలంగాణలో బెంగాల్ ఫార్ములా.. అమిత్ షా వ్యూహం.. రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు ?

అమిత్ షా (ఫైల్)

అమిత్ షా (ఫైల్)

Telangana| BJP: ఈ టీమ్‌లు నేరుగా ఢిల్లీలోని బీజేపీ నాయకత్వానికి తాము సేకరించిన డాటాను, సర్వే ఫలితాలను అందిస్తుందని.. ఎక్కడా స్థానిక నేతలను టచ్ చేయదని తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో అధికారం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలనే యోచనలో ఉన్న కమలనాథులు.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కొంతకాలంగా తెలంగాణలో బీజేపీకి అనుకూల పవనాలు వస్తుండటంతో.. బీజేపీ(BJP) మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇక తెలంగాణలో(Telangana) బీజేపీ అధికారంలోకి రావడానికి వ్యూహాలను ఖరారు చేస్తున్న ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. తాజాగా రాష్ట్రంలో బెంగాల్ ఫార్ములాను అమలు చేస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. బెంగాల్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీఎంసీకి పోటీ ఇచ్చింది. టీఎంసీతో పోల్చితే సీట్ల సంఖ్యలో పోటీ పడకపోయినా.. బెంగాల్‌లో తమ ఓట్ల శాతాన్ని ఎవరూ ఊహించని విధంగా పెంచుకోవడంలో కమలనాథులు బాగా సక్సెస్ అయ్యారు.

  ఇందుకోసం కొన్ని నెలల ముందు నుంచే బీజేపీ గట్టి గ్రౌండ్ వర్క్ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై బీ స్కూల్ టీమ్ ప్రతినిధులతో సర్వేలు చేయించింది. ఎక్కడా స్థానిక నేతలను అందులో భాగస్వామ్యం చేయలేదు. అలా చేయడం వల్ల సర్వే ఫలితాలు సరిగ్గా రావని బీజేపీ నాయకత్వం భావించింది. అనుకున్నట్టుగానే బెంగాల్‌లో బీ స్కూల్ టీమ్ సర్వేల ద్వారా అక్కడ తమ పార్టీ ఏ విధంగా ఉందనే దానిపై వాస్తవ పరిస్థితులు తెలుసుకోగలిగింది. తాజాగా తెలంగాణలోనూ అదే రకంగా బీ స్కూల్ టీమ్‌ల ద్వారా సర్వే చేయిస్తున్నారని సమాచారం.

  ఈ టీమ్‌లు నేరుగా ఢిల్లీలోని బీజేపీ నాయకత్వానికి తాము సేకరించిన డాటాను, సర్వే ఫలితాలను అందిస్తుందని.. ఎక్కడా స్థానిక నేతలను టచ్ చేయదని తెలుస్తోంది. ప్రస్తుతం మునుగోడులోనూ ఈ టీమ్‌లు పరిస్థితిని అంచనా వేసి పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేవలం పార్టీ పరిస్థితి అంచనా వేయడమే కాకుండా అక్కడ ఏయే వర్గాలు ఎవరి వైపు ఉన్నాయి ? ఎన్నికల్లో ఏయే వర్గాలు అత్యంత ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి ? అనే అంశాలను తమ నివేదికలో పొందుపర్చబోతున్నట్టు తెలుస్తోంది.

  KCR: మునుగోడుపై తేల్చేసిన కేసీఆర్ .. ఆ తరువాతే అభ్యర్థి ప్రకటన ?

  Rain alert: తెలంగాణకు భారీ వర్ష సూచన .. రెయిన్ ఎఫెక్ట్ ఎన్ని రోజులంటే ..?

  వీరి నివేదికల ఆధారంగానే రాష్ట్ర పార్టీ నేతలు ఏ విధంగా ముందుకు సాగాలి ? ఏయే వర్గాలకు చేరువ కావాల్సిన అవసరం ఉందనే దానిపై అమిత్ షా రాష్ట్ర నేతలకు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణపై సీరియస్‌గా ఫోకస్ చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం.. ఈ విషయంలో అనేక రకాలుగా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Amit Shah, Bjp, Telangana

  ఉత్తమ కథలు