హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP Plan: బీజేపీ భారీ స్కెచ్.. మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేసారి.. ఎవరూ ఊహించని విధంగా..

BJP Plan: బీజేపీ భారీ స్కెచ్.. మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేసారి.. ఎవరూ ఊహించని విధంగా..

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana BJP: ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఇతర బీజేపీ నాయకులంతా పాల్గొనే ఈ సభను అత్యంత భారీగా నిర్వహించడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బలపడుతోందనే సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది.

తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా దూకుడు ప్రదర్శిస్తున్న కమలనాథులు.. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా బలపడేందుకు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే నెల మొదటవారంలో హైదరాబాద్‌లో(Hyderabad) నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణలో(Telangana) రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ(BJP) గెలుస్తుందని ధీమాను ఆ పార్టీ శ్రేణులకు అందించేందుకు.. ప్రజల్లోనూ బీజేపీ బలపడుతోందని సంకేతాలు ఇవ్వడానికి కమలం పార్టీ కొత్త ప్లాన్ రెడీ చేసింది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలంతా తెలంగాణకు రాబోతున్నారు. అయితే వాళ్లంతా కేవలం హైదరాబాద్‌లోనే బస చేసేలా కాకుండా.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస చేసేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 119 మంది నాయకులు బస చేసేలా ప్లాన్ చేస్తోంది. ఈ జాబితాలో ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనేతలు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఎవరు ఏ నియోజకవర్గంలో బస చేయబోతున్నారనే దానిపై క్లారిటీ రానుంది.

నేతలు ఆయా నియోజకవర్గాల్లో బస చేసి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు ర్యాలీగా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల బీజేపీ రాజకీయ కార్యక్రమాలు కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా దాని ప్రభావం మొత్తం రాష్ట్రం మీద ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో జులై మొదటి వారంలో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన బీజేపీ జాతీయ నాయకత్వం.. పెరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Jagityala: మంత్రి ఎర్రబెల్లి మాటలపై మండిపడుతున్న యువత .. కాళీ బీరు సీసాలతో అక్కడే నిరసనలు

Telangana: తెలంగాణ బీజేపీకి షాకిచ్చిన పీకే సర్వే.. క్షేత్రస్థాయిలో కథ వేరే.. కమలానికి నిజంగానే అంత సీన్ లేదా?

ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఇతర బీజేపీ నాయకులంతా పాల్గొనే ఈ సభను అత్యంత భారీగా నిర్వహించడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బలపడుతోందనే సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రతి బూత్ నుంచి బీజేపీ కార్యకర్తలు ఈ సభకు వచ్చేలా చూసుకోవాలని ఇప్పటికే జిల్లా స్థాయిలోని నేతలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి నాయకులను నియోజకవర్గాల్లో బస చేయించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

First published:

Tags: Bjp, PM Narendra Modi, Telangana, Trs

ఉత్తమ కథలు