TS POLITICS BJP NEW COMMITTEE FOR JOININGS CREATE TENSION FOR CM KCR IN TELANGANA AK
BJP| KCR: కేసీఆర్‌కు కొత్త టెన్షన్ పెట్టిన బీజేపీ.. వాళ్లందరిపై ఫోకస్ ?
నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
BJP| TRS: ఈటలతో టచ్‌లోకి వెళ్లే వారిపై టీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా ఫోకస్ చేసిందనే చర్చ జరుగుతోంది. ఆయనతో టచ్‌లో వెళ్లే నేతలతో స్వయంగా టీఆర్ఎస్ ముఖ్యనేతలు మాట్లాడుతున్నారని.. పార్టీ మారే ఆలోచన మానుకోవాలని కోరుతున్నారని సమాచారం.
తెలంగాణ రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ కూడా అంతేస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలు ఎప్పటికప్పుడు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత బీజేపీ వేసిన పలు కమిటీలతో టీఆర్ఎస్ అలర్ట్ అయ్యిందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. తెలంగాణలో బీజేపీలోకి చేరికలు ఆశించిన స్థాయిలో లేవని భావిస్తున్న బీజేపీ.. ఇందుకోసం పాత కమిటీని రద్దు చేసి ఆ స్థాయిలో ఈటల రాజేందర్ కన్వీనర్‌గా కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, ఎ. చంద్రవేఖర్ వంటి వాళ్లకు స్థానం కల్పించింది.
వీరంతా గతంలో ఇతర పార్టీల్లో పని చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరి కొన్ని రోజులు మాత్రమే అవుతోంది. అలాంటి విశ్వేశ్వర్ రెడ్డిని కూడా ఈ కమిటీలో వేయడం వెనుక బీజేపీ ఉద్దేశ్యం సుస్పష్టంగా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కమిటీ ద్వారా అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ కొత్త టెన్షన్ పెట్టిందనే చర్చ జరుగుతోంది. గతంలో ఇతర పార్టీలో ఉండి బీజేపీలో చేరిన వీళ్లందరికీ ఆయా పార్టీల నేతలను మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వీరంతా ఆయా నేతలతో టచ్‌లోకి వెళ్లి పార్టీలోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు.
ఇక టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి ఎంతమంది నేతలను బీజేపీలోకి తీసుకెళతారన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈటలతో టచ్‌లోకి వెళ్లే వారిపై టీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా ఫోకస్ చేసిందనే చర్చ జరుగుతోంది. ఆయనతో టచ్‌లో వెళ్లే నేతలతో స్వయంగా టీఆర్ఎస్ ముఖ్యనేతలు మాట్లాడుతున్నారని.. పార్టీ మారే ఆలోచన మానుకోవాలని కోరుతున్నారని సమాచారం.
ఈటల ద్వారా బీజేపీలోకి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నదే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహమని పలువురు చర్చించుకుంటున్నారు. ఈటల రాజేందర్‌తో పాటు ఈ కమిటీలోని ఇతర నేతలపై కూడా టీఆర్ఎస్ నేతల నిఘా పెట్టారని సమాచారం. బీజేపీలో చేరాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలను కూడా టీఆర్ఎస్లోకి తీసుకురావాలని.. ఆ రకంగా బీజేపీ పార్టీకి షాక్ ఇవ్వాలనే ఆలోచనలో గులాబీ పార్టీ నాయకత్వం ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ బీజేపీలో కొత్త కమిటీ వేయడం ద్వారా బీజేపీ పెద్దలు టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు కొత్త టెన్షన్ పెట్టారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.