TS POLITICS BJP NATIONAL LEADERS ARE COMING TO 13 CONSTITUENCIES IN MAHBUBNAGAR TODAY HERE THE DETAILS MBNR PRV
Mahbubnagar: నేడు పాలమూరుకు బీజేపీ అగ్రనేతలు.. 13 నియోజకవర్గాలకు రాక.. వచ్చేది వీళ్లే..
ప్రతీకాత్మక చిత్రం
బీజేపీ నేతలు గురువారం మహబూబ్నగర్ (Mahbubnagar) ఉమ్మడి జిల్లాలో బాట పట్టనున్నారు. 13 నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ ముఖ్యులు హాజరవుతున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రులు సైతం ఉన్నారు.
ఈ నెల మూడో తేదీన హైదరాబాద్ (Hyderabad)లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) బహిరంగ సభకు పాలమూరు ఉమ్మడి జిల్లా నియోజకవర్గ కార్యకర్తలు బహిరంగ సభకు హాజరు కావాలంటూ వారం రోజుల ముందు నుంచే బీజేపీ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. బహిరంగ సభకు నియోజకవర్గాల వారీగా జన సమీకరణ కోసం ఏకంగా భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర రాష్ట్ర నాయకులు పాలమూరు జిల్లాకు గురువారం చేరుకునే అవకాశముందని పార్టీ శ్రేణులు తెలిపారు.
13 నియోజకవర్గాలకు..
బీజేపీ నేతలు గురువారం మహబూబ్నగర్ (Mahbubnagar) ఉమ్మడి జిల్లాలో బాట పట్టనున్నారు. నియోజకవర్గాల్లోని మకం వేసి పార్టీ విస్తరణ పై కార్యకర్తలతో దిశా నిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 13 నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ ముఖ్యులు హాజరవుతున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రులు (Former chief ministers) సైతం ఉన్నారు. వీరంతా మూడు రోజులపాటు నియోజకవర్గాల్లోఉండి పార్టీ పరిస్థితులపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. పోలింగ్ బూతుల అధ్యక్షులతో (Presidents) సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. మండల పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం పై ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా తీసుకెళ్లాలో స్థానిక నేతలకు వివరించనున్నారు. దీంతోపాటు హైదరాబాద్లో (Hyderabad) జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ (Meeting)కు పెద్ద ఎత్తున నియోజకవర్గాల నుంచి తరలి వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను తరలించే విధంగా అవలంబించే వ్యూహంపై జిల్లా నాయకులతో చర్చరించున్నారు. అయితే పాలమూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో వచ్చే ప్రముఖుల్లో ఉత్తరాఖండ్ (Uttarakhand), కర్ణాటక (Karnataka), గుజరాత్ (Gujarat) రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు (Former Chief ministers) కూడా ఉన్నారు..
నియోజకవర్గం.. హాజరుకానున్న ముఖ్య నేతలు..
మహబూబ్నగర్ -తీర్థ సింగ్ రావత్ ఉత్తర్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి.. దేవరకద్ర - జగదీష్ షెట్టర్ (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి) .. జడ్చర్ల- విజయ రూపపాణి (గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి) ..గద్వాల్ఆ శీష్ సూద్ (భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి) ..అలంపూర్ - ప్రేమ్ కుమార్ (ఎమ్మెల్యే బీహార్).. నారాయణపేట-విశ్వజిత్ ప్రతాప్ సింగ్ రాణి (గోవా ఎమ్మెల్యే) ..మక్తల్ - సదానంద గౌడ క(ర్ణాటక మాజీ ముఖ్యమంత్రి).. వనపర్తి - రాజేష్ అగర్వాల్ (ఉత్తర ప్రదేశ్). నాగర్ కర్నూల్ - నితిన్ భాయ్ పటేల్ (గుజరాత్). కొల్లాపూర్- రాధాకృష్ణ (మాజీ ఎంపీ తమిళనాడు)... కల్వకుర్తి - దినేష్ శర్మ ( ఉత్తర ప్రదేశ్) ...అచ్చంపేట - నిర్మల్ సింగ్ (జమ్మూ కశ్మీర్) మాజీ ఉపముఖ్యమంత్రి తో పాటు తదితరులు హాజరవుతున్నారు..
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.