హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే..ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్

Telangana Politics: కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే..ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్

kavitha arvindh,sanjay

kavitha arvindh,sanjay

Telangana Politics: బీఆర్ఎస్‌ పార్టీ నాయకులన్నా..ఆ పార్టీ అధినేతపైన ఒంటికాలుపై లేచే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈసారి సొంత పార్టీ అధ్యక్షుడిపైనే ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నిజామాబాద్‌ ఎంపీ సూచించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీఆర్ఎస్‌ పార్టీ నాయకులన్నా..ఆ పార్టీ అధినేతపైన ఒంటికాలుపై లేచే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind)వాయిస్ ఒక్కసారిగా మారింది. తన సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla kavitha)పై చేసిన వ్యాఖ్యలను అర్వింద్ తప్పు పట్టారు. బండి సంజయ్‌ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని నిజామాబాద్‌ (Nizamabad)ఎంపీ సూచించారు. అలాంటి వ్యాఖ్యల్ని తాను సమర్ధించబోనన్నారు. తెలంగాణ సంస్కృతిలో అనేక సామెతలు ఉన్నాయని ...వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటూ బండి సంజయ్‌కి సైలెంట్‌గా చురకలంటించారు. ఢిల్లీ(Delh) లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలో కవితను అరెస్ట్ చేస్తారా అని వేసిన ప్రశ్నకు లేదంటే ముద్దు పెట్టుకుంటారా అని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ధర్మపురి అర్వింద్ ఖండించారు.

సంజయ్‌ వ్యాఖ్యలు తప్పే..

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను సమర్ధించబోనని సొంత బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని ఆయన వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్‌కు సూచించారు. బండి సంజయ్‌ కవితపై చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్ధులకు ఆయుధాలుగా మారాయని ..అందుకు ప్రతిఫలంగా ఆయన వాటిపై సంజాయిషీ ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఎన్నో సామెతలు వాడుకలో ఉన్నప్పటికి వాటిని ఉపయోగించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలన్నారు. అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని..కో ఆర్డినేషన్ సెంటర్ అంటూ బండి సంజయ్‌కి షాక్ ఇచ్చారు ధర్మపురి అర్వింద్.

బండికి షాక్ ఇచ్చిన అర్వింద్..

పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి షాక్ ఇచ్చే విధంగా మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ..కేసీఆర్ , కల్వకుంట్ల కవితకు కూడా పలు సూచనలు చేశారు. ఈడీ విచారణకు కవిత సహాకరించడం లేదని..సహాకరిస్తే మంచిదన్నారు. ఈడీకి సహాకరించకపోతే వీలైనంత త్వరగా కస్టడీలోకి తీసుకునే అవకాశముందని జోస్యం చెప్పారు అర్వింద్. అంతే కాదు కేసీఆర్‌ కూడా కవితపై కాకుండా రాష్ట్ర ప్రజలపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు బీజేపీ ఎంపీ.

Amit Shah: అమిత్ షా ఫ్లైట్ లో సాంకేతిక సమస్య..ఇంకా హైదరాబాద్ లోనే షా!

భిన్న స్వరాలు..

మూడ్రోజుల క్రితం బండి సంజయ్ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీఆర్ఎస్‌ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. పలుచోట్ల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఈక్రమంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు సైతం బండి సంజయ్‌ వ్యాఖ్యల్ని సమర్ధించారు. తెలంగాణలో వాడుకలో ఉన్న మాట ఆయన అన్నారంటూ వెనకేసుకొచ్చారు. ఆయన మాట్లాడిన దాంట్లో పొరపాటు లేదన్నారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేనంటూ చెప్పడం చూస్తుంటే బండి సంజయ్‌పై వచ్చే విమర్శల్ని తగ్గించేందుకే ఇలా వ్యాఖ్యానించారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

First published:

Tags: Bandi sanjay, Kalvakuntla Kavitha, Telangana Politics

ఉత్తమ కథలు