Home /News /telangana /

TS POLITICS BJP MLA RAJASINGH MADE SENSATIONAL COMMENTS SAYING THAT HE WILL DEFINITELY KILL ME SNR

Telangana | BJP MLA Rajasingh : నా శరీరంలో బుల్లెట్లు దిగడం ఖాయం .. నన్ను కచ్చితంగా చంపేస్తారు : రాజాసింగ్‌ సంచలన కామెంట్స్

BJP MLA Rajasingh

BJP MLA Rajasingh

Telangana | Rajasingh: తనను కచ్చితంగా చంపుతారంటూ గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్‌(TRS) జోరును తట్టుకొని, మస్లీజ్‌ పార్టీ(AIMIM) కంచుకోటలో కమలం గుర్తుతో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేకి ఇప్పుడు ప్రాణ హాని ఏర్పడిందా..? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేని చంపేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లెవరూ..? అసలు ఆయన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..? గ్రేటర్ సిటీ(Greater City)లో కాషాయం జెండా ఎగురవేసిన ఏకైక ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఎలా చూడాలి. ఇప్పుడు ఇదే తెలంగాణ(Telangana) పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. గ్రేటర్‌ సిటీలో గ్రేట్‌గా లీడర్‌గా ఎన్నికైన రాజాసింగ్‌(Rajasingh )ని చంపాలనుకుంటున్న వాళ్లు ఎవరూ అనే చర్చ జరుగుతోంది.

Telangana : ఆ మేడమ్ పెద్ద ఆఫీసర్ .. కిందిస్థాయి ఉద్యోగినితో ఏం పని చేయించుకుందో తెలుసా..నన్ను కచ్చితంగా చంపేస్తారు..
తెలంగాణలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరు తెలియని వారుండరు. హిందుత్వం కోసం పోరాడే వ్యక్తుల్లో ఈ బీజేపీ ఎమ్మెల్యే ముందు వరుసలో ఉంటారు. గో సంరక్షణ కోసం నడుం బిగించిన వారిలో కూడా రాజాసింగ్‌ అగ్రస్థానంలో నిలిచారు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ప్రజాసమస్యలు, హిందుత్వంపై దాడులపై తన స్వరాన్ని బిగ్గరగా వినిపించే రాజాసింగ్‌ని ఎవరో బెదిరిస్తున్నారట. చంపేస్తారంట. ఇది పుకార్లు కాదు..గొబెల్స్ ప్రచారం అంతకంటే కాదు స్వయంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ నోటితో చెప్పిన మాటలు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామపంచాయతీ పరిధిలో చత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహ ఆవిష్కరణకు ప్రత్యేక అతిథిగా వెళ్లిన రాజాసింగ్ అక్కడ బహిరంగ సభపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. హిందుత్వం కోసం ధర్మపరిరక్షణ కోసం మాట్లాడే నా లాంటి వాళ్లను చంపేస్తారు. ఖచ్చితంగా నన్ను ఇవాళ కాకపోతే రేపు చంపేస్తారు. నా శరీరంలో కూడా బుల్లెట్లు దిగుతాయి కావాలంటే డేట్‌ రాసిపెట్టుకోండి నేను చెబుతున్నా అంటూ క్లియర్‌ కట్‌గా చెప్పారు రాజాసింగ్. తనను చంపుతారని తనకు తెలుసని..అందుకు సిద్ధంగానే ఉన్నానని కూడా చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే. అయితే తాను బ్రతికితే ఛత్రపతి శివాజీ మహరాజ్‌లా బ్రతుకుతానని ..చనిపోతే ఆయన కొడుకు సంబాజీలాగా చనిపోతానంటూ వేదికపై నుంచి స్పష్టం చెప్పారు.కలకలం రేపుతున్న రాజాసింగ్‌ వ్యాఖ్యలు..
చత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని...వాటిని అడ్డుకోకపోతే ఒకరిద్దరు కాదు ఏకంగా గ్రామాలకు గ్రామాల్నే మత మార్పిడి చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. దైవం అందరికి ఒకటేనని అది ఏ పార్టీతో సంబంధం లేదని ...అందుకే రాజకీయ నాయకులు, పార్టీలు రాజకీయలకు అతీతంగా ధర్మపరిరక్షణ కోసం కృషి చేయాలని ...పోరాడాలని రాజాసింగ్‌ పిలుపునిచ్చారు.

Suicide attempt : మేం లవర్స్ కాదు మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ .. ఎవరూ నమ్మడం లేదని ఏం చేశారో తెలుసాచంపాలని చూస్తోంది ఎవరూ..?
గతంలో అనేక సందర్బాల్లో హిందుత్వం, దేశభక్తి, జాతీయభావనపై గట్టిగా మాట్లాడిన రాజాసింగ్‌ ..అదే నోటితో తనను చంపేస్తారని చెప్పడం అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. రాజాసింగ్ గెలిచింది బీజేపీ గుర్తుతో అయినా ..ఏనాడు బీజేపీతో పెద్దగా అంటిపెట్టుకున్న సందర్భాలు లేవు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కమిటీలను ఎంపిక చేయడంలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా పట్టించుకోలేదు. గోషామహాల్‌ నియోజకవర్గంలో గ్రేట్ ఎమ్మెల్యే నిలబడిన రాజాసింగ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే నిజంగా ఆయన్ని ఎవరైనా బెదిరించారా లేక చంపుతామని హెచ్చరించారా అనే సందేహాలు సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతల్లో కలుగుతోంది. దీనిపైనే విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Raja Singh, Telangana Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు