హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay| Raghunandan Rao: బండి సంజయ్‌తో విభేదాలు.. అది వాస్తవమేనన్న రఘునందన్ రావు

Bandi Sanjay| Raghunandan Rao: బండి సంజయ్‌తో విభేదాలు.. అది వాస్తవమేనన్న రఘునందన్ రావు

బండి సంజయ్, రఘునందన్ రావు( ఫైల్ ఫోటో)

బండి సంజయ్, రఘునందన్ రావు( ఫైల్ ఫోటో)

Raghunandan Rao: తనకు పార్టీ శాసనసభాపక్ష నేతగా అవకాశం రాకపోవడం వెనుక బండి సంజయ్ ఉన్నారని జరుగుతున్న ప్రచారంపై రఘునందన్ రావు వివరణ ఇచ్చారు.

  దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘుందన్‌రావుకు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావుకు(Raghunandan Rao) ప్రాధాన్యత దక్కడం లేదని.. ఈ అంశంపై ఆయన పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా దీనిపై ఎమ్మెల్యే రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు(Bandi Sanjay) మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు. బండి సంజయ్, తాను కలిసి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పని చేశామని.. ఇద్దరం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని ఆశించామని ఆయన అన్నారు. బండి సంజయ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందని.. ఆయన నాయకత్వంలో తాము కలిసి పని చేస్తున్నామని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.

  తనకు పార్టీ శాసనసభాపక్ష నేతగా అవకాశం రాకపోవడం వెనుక బండి సంజయ్ ఉన్నారని జరుగుతున్న ప్రచారాన్ని కూడా రఘునందన్ రావు కొట్టిపారేశారు. రాష్ట్రాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎవరు ఉండాలనేది జాతీయస్థాయిలో ఉండే బీజేపీ(BJP) పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని.. ఈ అంశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి అధికారం ఉండదని అన్నారు. అలాంటప్పుడు ఆయన తనకు శాసనసభాపక్ష నేత పదవి రాకుండా ఎలా అడ్డుకుంటారని అన్నారు.

  రాజకీయ పార్టీలో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజమని రఘునందన్ రావు అన్నారు. అయితే పార్టీలో కొన్ని సందర్భాల్లో మీటింగ్స్‌లో పిలిచినప్పుడు కొంత అసౌకర్యానికి గురవుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ అంశాన్ని పరిష్కరిస్తారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ప్రోటోకాల్ విషయాన్ని సంఘటన కార్యదర్శికి దృష్టికి తీసుకెళతామని అన్నారు.

  YS Jagan| KCR: జగన్ నిర్ణయంతో డైలమాలో కేసీఆర్.. ఆ ఆలోచన విరమించుకున్నట్టేనా ?

  Telangana Politics: ఆ ఇద్దరు సీనియర్ నేతలపై రేవంత్ రెడ్డి ఫోకస్.. కాంగ్రెస్‌లోకి తీసుకొస్తారా ?

  తాను మళ్లీ టీఆర్ఎస్’లోకి వెళతానని కొందరు చేస్తున్న ప్రచారం కూడా నిజంకాదని అన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని.. అలాంటి పార్టీని మునిగిపోతున్న నావ లాంటి టీఆర్ఎస్‌లోకి ఎందుకు వెళతామని రఘునందన్ రావు అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Raghunandan rao, Telangana

  ఉత్తమ కథలు