హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP vs TRS : దుబ్బాకైనా.. సిద్దిపేటైనా నేను రెడీ నువ్వు పోటీకి సిద్ధమా హరీష్‌రావుకు రఘునందన్‌రావు సవాల్

BJP vs TRS : దుబ్బాకైనా.. సిద్దిపేటైనా నేను రెడీ నువ్వు పోటీకి సిద్ధమా హరీష్‌రావుకు రఘునందన్‌రావు సవాల్

HARISH RAGHUNANDAN(FILE)

HARISH RAGHUNANDAN(FILE)

BJP vs TRS: ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు మంత్రి హరీష్‌రావుపై ఫైర్ అయ్యారు. అభివృద్ధితో పాటు తన నియోజకవర్గంలో పోటీ చేసి గెలవమని సవాల్ చేశారు. లేదంటే తాను సిద్దిపేటలో పోటీ చేసి గెలిచి చూపించమంటావా అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Medak, India

(K.Veeranna,News18,Medak)
తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) అగ్రనేతల పర్యటనలు, ప్రజల్లో కాషాయం పార్టీకి వస్తున్న ఆదరణతో ఆపార్టీ ఎమ్మెల్యేలకు ఉత్సాహం రెట్టింపు అవుతోంది. తెలంగాణలో జరిగిన నాలుగు ఉపఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచింది బీజేపీ . అందులో ఒకటే దుబ్బాక (Dubbaka). ఈ నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగిన పోటీలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు రఘునందన్‌రావు(Raghunandan Rao). గెలిచి సుమారు ఏడాదిపైగా గడిచినప్పటికి మధ్యలో ఎక్కడా అధికార పార్టీపై సవాళ్లు చేసిన దాఖలాలు లేవు. కాని ఇప్పుడు మాత్రం ఏకంగా సిద్దిపేట(Siddipet)ఎమ్మెల్యే రాష్ట్ర హెల్త్ అండ్ ఫైనాన్స్‌ మినిస్టర్ హరీష్‌రావు(Harish Rao)కు సవాల్‌ విసిరారు రఘునందన్‌రావు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం చేశామని చెబుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశ్నించారు.

Hyderabad : తనను విడిచి వెళ్లిందనే బాధతో ..పెంపుడు కుక్క కోసం డిగ్రీ స్టూడెంట్ ఏం చేశాడో తెలుసాహరీష్‌పై రఘునందన్‌ ఫైర్ ..
అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కాన్స్‌స్టెన్సీ వరకు. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు ఏ విషయంలోనైనా చర్చకు, పోటీకి మేం రెడీ మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ తెలంగాణ వైద్య, ఆరోగ్య, ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావుకు సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని వెంట బెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కాదు..దమ్ముంటే నువ్ దుబ్బాకలో పోటీ చేస్తావా అంటూ మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు రఘునందన్‌రావు. లేదంటే తనను సిద్ధిపేటలో పోటీ చేసి గెలిచి చూపించమంటారా అంటూ సమరసింహారెడ్డి సినిమాలోని ప్లేస్ నువ్ చెప్పినా సరే లేదంటే నన్ను చెప్పమన్నా సరే టైమ్ నువ్ చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అనే డైలాగ్‌ని దించేశారు బీజేపీ ఎమ్మెల్యే.


గెలుపు ఓటములపై సవాల్..
దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తూ తనపై చేస్తున్న చేస్తున్న ప్రచారాన్ని మానుకోవాలని హరీష్‌రావుకు హితవు పలికారు రఘునందన్‌రావు. ఉపఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్‌లో ప్రచారం చేసిన నీకు ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పిన విషయాన్ని మర్చిపోయావా అంటూ సెటైర్ వేశారు. అబద్దాలు ప్రచారం చేయడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరొకటి తెలుసా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు దుబ్బాక నియోజకవర్గంలో 50వేలకుపైగా ఫించన్లు ఇస్తున్నామని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న రఘునందన్‌రావు నియోజకవర్గంలో గుడిసెలు, ఇళ్లు అన్నీ కలిపి 56వేలు ఉంటే అంత మందికి ఫించన్‌లు ఎలా ఇస్తున్నారో సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు.

Drugs gang arrest: పబ్‌లు, క్లబ్బుల్లో కాదు కొరియర్‌లో డ్రగ్స్ సప్లై .. హైదరాబాద్‌లో ఎంత మంది వాడుతూ పట్టుబడ్డారో తెలుసా..?


తగ్గేదేలే..
గుజరాత్‌లో బీజేపీ ఆరోసారి గెలిపించి చూపిస్తాం..నువ్ తెలంగాణలో టీఆర్ఎస్‌ని మూడో సారి గెలిపించి చూపించగలవా అంటూ హరీష్‌రావుకు ప్రశ్నలు సంధించారు. నాలుగైదు రోజుల క్రితం మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు కలిసే నియోజకవర్గంలో చెక్కులు పంపిణి చేశారు. ఆ కార్యక్రమం జరిగిన రెండ్రోజులకు రఘునందన్‌రావు ఈ రేంజ్‌లో విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం దేనికి సంకేతమని ఆలోచిస్తున్నారు బీజేపీ శ్రేణులు,నియోజకవర్గ ప్రజలు.

Published by:Siva Nanduri
First published:

Tags: Harish Rao, Raghunandan rao, Telangana Politics

ఉత్తమ కథలు