టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. కేసీఆర్‌కు ఎదురొడ్డి ఘన విజయం సాధించారు. దీంతో భవిష్యత్తు రాజకీయాల్లో కేసీఆర్‌కు(KCR) బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ అవుతారనే వార్తలు వినిపించాయి. ఆయనకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. వచ్చే ఎన్నికలు ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగానే సాగుతాయని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. కానీ ఆ తరువాత బీజేపీలో ఈటల రాజేందర్‌కు(Etela Rajendar) అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత లభించలేదు. అయితే తాజాగా బీజేపీలో ఈటల రాజేందర్ గురించి అనుకోని విధంగా చర్చ జరుగుతోంది. ఇందుకు అసలు కారణంగా ఆయన గజ్వేల్(Gajwel) నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించడమే.
నిజానికి కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. బీజేపీ నాయకత్వం తనను సరిగ్గా వాడుకోవడం లేదనే భావన ఆయనలో ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసిందో లేక ఈటల రాజేందర్ స్వయంగా వ్యూహరచన చేసుకున్నారో తెలియదు కానీ.. ఆయన గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ జోరందుకుంది. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే కేసీఆర్ గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం వల్ల కేసీఆర్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు బీజేపీలో తనకు గట్టి పోటీ ఇస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా షాక్ ఇస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ గజ్వేల్ బరిలో దిగడం ఖాయమైతే.. బీజేపీ అధినాయకత్వం సహా తెలంగాణ సమాజం చూపంతా ఈటల రాజేందర్ మీదే ఉంటుంది. ఆయన కేసీఆర్‌పై విజయం సాధిస్తారా ? సాధిస్తే ఏ స్థాయిలో ఆ విజయం ఉంటుంది ? కేసీఆర్ మీద గెలుపు కోసం ఈటల రాజేందర్ ఏ రకమైన వ్యూహాలు అనుసరించబోతున్నారనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
Panipuri: పానీపూరి లవర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్.. దూరంగా ఉండాలంటూ..
Rain Alert : తెలంగాణ ప్రజలపై వర్షపు పిడుగు .. మరో మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు: IMD
అదే జరిగితే బీజేపీలోనూ ఈటల రాజేందర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారుతారని.. ఇంకా చెప్పాలంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను కూడా మించిపోయే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. స్వతహాగా కేసీఆర్ వ్యూహారచన శైలిని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా.. ఆయనతో కలిసి వ్యూహాలు సిద్ధంగా చేసిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటల రాజేందర్.. గజ్వేల్‌లో పోటీ ద్వారా ఒకేసారి అటు కేసీఆర్‌కు ఇటు పార్టీ చీఫ్ బండి సంజయ్‌కు చెక్ చెప్పేందుకు ప్లాన్ చేస్తున్నారేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Etela rajender, Gajwel, Telangana