Home /News /telangana /

TS POLITICS BJP MLA ETELA RAJENDAR FOCUSING MORE ON MUNUGODU BY ELECTIONS TO TARGET TELANGANA CM KCR AK

Etela Rajendar: మరోసారి ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్.. మునుగోడులో హుజూరాబాద్‌ రాజకీయం?

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్​)

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్​)

Munugodu: కేసీఆర్ రాజకీయాలు గురించి బాగా తెలిసిన ఈటల రాజేందర్ అయితే.. మునుగోడు ఉఫ ఎన్నికల్లో మెరుగ్గా పని చేసి.. పార్టీకి ఆశించిన ఫలితాలు తీసుకొస్తారని బీజేపీ నాయకత్వం కూడా భావిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలో ఇప్పుడు మునుగోడు సరికొత్త ఎన్నికల రణక్షేత్రంగా మారబోతోంది. ఇక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందనే విషయం వేరే చెప్పనవసరం లేదు. అయితే కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్థికి సరైన పోటీ కూడా ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ.. మునుగోడులో(Munugodu) ఈ రెండు పార్టీలకు ఎంతవరకు గట్టి పోటీ ఇస్తుందన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే బీజేపీ(BJP) మాత్రం మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మునుగోడులో టీఆర్ఎస్‌ను ఓడిస్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని సగం ఓడించినట్టే అనే భావనలో ఉంది కమలం పార్టీ. అందుకే ఇక్కడ కూడా హుజూరాబాద్(Huzurabad) తరహాలో విజయం సాధించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను(Etela Rajendar) మునుగోడులో ముందుగానే రంగంలోకి దింపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    మునుగోడులో ఓ వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మిగతా పార్టీల నేతలను తనవైపు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఈటల రాజేందర్ కూడా తనవంతుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజులగా అక్కడి టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో ఇంకెంతమంది టీఆర్ఎస్ లోకల్ లీడర్లను ఈటల రాజేందర్ కాషాయదళంలోకి తీసుకెళతారో అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.



    నిజానికి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఇంతకంటే తీవ్రంగా జరిగింది. కానీ అక్కడ గట్టి పట్టున్న ఈటల రాజేందర్.. గెలుపు కోసం తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేశారు. తాజాగా ఆయన మునుగోడులో ముందుగానే వాలిపోవడంతో... కేసీఆర్ మార్క్ రాజకీయాలకు ధీటుగా మునుగోడులో ఈటల రాజేందర్ మార్క్ రాజకీయాలు ఉంటాయేమో అనే చర్చ జరుగుతోంది.

    BJP| Telangana: తెలంగాణ బీజేపీ నేతకు పెద్ద పదవి.. రాష్ట్రంపై మరింతగా ఫోకస్..

    CM KCR: దేశ రాజకీయాలపై చర్చ జరగాలి.. టీవీల్లో వార్తలు చూసి వదిలేయవద్దు..

    మునుగోడులో టీఆర్ఎస్ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నారని.. అలా వచ్చిన వారి ద్వారా మరికొందరు నేతలను ఆకర్షించేందుకు వ్యూహరచన చేశారని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ బాధ్యతను స్థానికంగా ఈటల రాజేందర్‌ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ రాజకీయాలు గురించి బాగా తెలిసిన ఈటల రాజేందర్ అయితే.. మునుగోడు ఉఫ ఎన్నికల్లో మెరుగ్గా పని చేసి.. పార్టీకి ఆశించిన ఫలితాలు తీసుకొస్తారని బీజేపీ నాయకత్వం కూడా భావిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Etela rajender, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు