బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender)శాసన సభ సమావేశాల(Telangana assembly) నుంచి సస్పెండ్ అయ్యారు. ఈనెల 6వ తేదిన సమావేశాల తొలి రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivas Reddy)పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ని సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈతీర్మానంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సభలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. స్పీకర్‌ని మర మనిషి అని ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన్ని సమావేశాల నుంచి సస్పెండ్(Suspended)చేయాలని పట్టుబట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
సభలో వాగ్వాదం..
ఈవిషయంపై ఈటల సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దాస్యం వినయ్ భాస్కర్. దానిపై జరిగిన వాగ్వాదంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే సమావేశాలకు హాజరు కావాలని కోరడంతో స్పీకర్ స్పందించారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ఈటల రాజేందర్‌ని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈటల రాజేందర్ సస్పెండ్ అయ్యే ముందు సభలోని అధికార పార్టీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. సభలో ఉండే హక్కు తనకు ఉందా లేదా అని ప్రశ్నించారు. తనను బెదిరిస్తున్నారా అసలు ఏం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫస్ట్ డే గైర్హాజరు..రెండో రోజు సస్పెండ్ ..
సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైనప్పటికి బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరుకాలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాల్గో విడత పాదయాత్ర ఉన్నందునే ఈటల రాజేందర్ అసెంబ్లీకి రాలేదు. అయితే అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కూడా ఈటల రాజేందర్ కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
24గంటల్లోనే రియాక్షన్..
స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఈటల క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. అయితే తన కామెంట్స్‌ను ఈటల సమర్థించుకున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని సభ నుంచి సస్పెండ్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సోమవారం సభలో ఈటలపై తీర్మానం పెడతారని జోరుగా చర్చ జరిగిన నేపధ్యంలో ఆయన సూరారం సభలో కేసీఆర్‌నే తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేస్తానంటూ శపథం చేశారు ఈటల రాజేందర్. దానికి రివేంజ్‌గానే ఈటలను మంగళవారం సభ నుంచి సస్పెండ్ చేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Telangana Politics, Ts assembly sessions