Home /News /telangana /

TS POLITICS BJP MAY OFFER RAJYA SABHA SEAT TO MY HOME JUPALLY RAMESHWAR RAO WHO IS CLOSE TO TRS CM KCR AMID CHINNA JEEYAR ISSUE MKS

CM KCr | Rameswar Rao Jupally: కేసీఆర్‌తో విభేదాలు.. మైహోం జూపల్లికి బీజేపీ రాజ్యసభ సీటు?

జూపల్లి, చినజీయర్ తో సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

జూపల్లి, చినజీయర్ తో సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

కేసీఆర్ దేశపర్యటనలో బిజీ అవుతుండగా, తెలంగాణలో టీఆర్ఎస్ కు భారీ షాకిచ్చేలా బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ముమ్మరం చేసింది. కేసీఆర్ కు అత్యంత ఆప్తుడడైన ప్రముఖ పారిశ్రామికవేత్త, మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుపై కమలనాథులు దృష్టి పెట్టారు.

ఇంకా చదవండి ...
బీజేపీని బంగాళాఖాతంలో కలిపి, కేంద్రంలోని మోదీ సర్కారును గద్దెదించుతానంటూ గతంలో శపథాలు చేసిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ స్థాయి ప్రత్యాత్నమాయ అజెండాతో దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. కేసీఆర్ దేశపర్యటనలో బిజీ అవుతుండగా, తెలంగాణలో టీఆర్ఎస్ కు భారీ షాకిచ్చేలా బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ముమ్మరం చేసింది.

టీఆర్ఎస్ సభ్యుడు కాకపోయినా, సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా, గొప్ప సమర్థకుడిగా పేరుపొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుపై కమలనాథులు దృష్టి పెట్టారు. చినజీయర్ స్వామితో కేసీఆర్ విభేదాల క్రమంలోనే జూపల్లి కూడా సీఎం తీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చినజీయర్ ఇప్పుడు నేరుగా ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న దరిమిలా జూపల్లి కూడా కేసీఆర్ కు దూరం కావొచ్చని అంచనా వేస్తోన్న బీజేపీ ఆయనకు ఓ ఆఫర్ సిద్ధం చేసిందట..

CM KCR: పట్టువీడని కేసీఆర్.. నేటి నుంచి దేశవ్యాప్త పర్యటన.. 8 రాష్ట్రాలు ప్రభావితం అయ్యేలా.. ఇదీ ప్లాన్..


సీఎం కేసీఆర్ కులానికే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తున్నది. చినజీయర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమతామూర్తి ప్రారంభోత్సవం సమయంలో జూపల్లికి సీఎం కేసీఆర్‌కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జూపల్లికి, కేసీఆర్‌కు పొసగడం లేదని భావిస్తున్న బీజేపీ వర్గాలు ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడం ఖాయమని చెబుతున్నాయి. ఆయన సేవలను పార్టీకి ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

CM KCR | Centre: కేసీఆర్ సంచలనం.. గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులు వద్దు.. రాష్ట్రాల ద్వారానే అన్ని పథకాలు..


తెలంగాణ కోసమే ప్రత్యేకంగా చింతన్ బైఠక్ నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. అంతకుముందే చేరికలను ముమ్మరం చేయాలని చూస్తున్నది. జూపల్లి రామేశ్వరరావును రాజ్యసభకు నామినేట్‌ చేసే ప్రతిపాదనపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కేసీఆర్ తో ఆత్మీయ అనుబంధం, టీఆర్ఎస్ అనుకూల మీడియాకు సారధ్యం తదితర అంశాల నేపథ్యంలో బీజేపీ ఆకర్ష్‌ ప్రయత్నాలకు జూపల్లి రామేశ్వరరావు ఎటువంటి వైఖరి తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. రాజ్యసభ సీటు ఆఫర్ పై ఇటు బీజేపీగానీ, అటు జూపల్లిగానీ అధికారికంగా ఇప్పటిదాకా నోరుమెదపలేదు. మరోవైపు,

CM KCR | Chinna Jeeyar : ఆలయాల నిర్వహణపై చినజీయర్ అనూహ్య వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను టార్గెట్ చేశారా?


సీఎం కేసీఆర్ కు దగ్గరి వ్యక్తి అయిన జూపల్లి రామేశ్వరరావు తోపాటు కాంగ్రెస్‌ నేతలపైనా బీజేపీ‘ఆకర్ష్‌’ మంత్ర ప్రయోగాలను ముమ్మరం చేసింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులపై కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్‌, భూపేందర్‌ యాదవ్‌లను కలుసుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత కుమారుడూ బీజేపీలో చేరే సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కూడా బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Chinna Jeeyar Swamy, CM KCR, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు