Home /News /telangana /

TS POLITICS BJP LEADERSHIP GIVES KEY POST TO K LAKSHMAN OF TELANGANA GIVEN MORE PRIORITY TO STATE AK

BJP| Telangana: తెలంగాణ బీజేపీ నేతకు పెద్ద పదవి.. రాష్ట్రంపై మరింతగా ఫోకస్..

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

లక్ష్మణ్‌ను పార్టీలోని అత్యున్నత, ప్రాధాన్యత కలిగిన కమిటీల్లో చోటు కల్పించి.. తెలంగాణ రాష్ట్రం తమకు ఎంత ముఖ్యమైనదో మరోసారి క్లారిటీ ఇచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కొత్తవారికి స్థానం దక్కింది. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, తెలంగాణ నేత లక్ష్మణ్‌లను(BJP) కొత్తగా పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,(Shivraj Singh Chauhan)  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల(Nitin Gadkari) స్థానంలో బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్‌లు ఎంపికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కేంద్ర పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిలో జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఉండగా, ఇతర సభ్యులుగా ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, కె. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్ ఉన్నారు. సత్యనారాయణ జాటియా, BL సంతోష్ కొత్తగా చేరారు.

    కేంద్ర పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా బీఎల్ సంతోష్ వ్యవహరిస్తారు. భారతీయ జనతా పార్టీలో విధాన రూపకల్పనలో అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన యూనిట్ పార్లమెంటరీ బోర్డు. పార్లమెంటరీ బోర్డుతో పాటు కొత్త కేంద్ర ఎన్నికల కమిటీని కూడా బీజేపీ ఏర్పాటు చేసింది. ఇందులో షానవాజ్ హుస్సేన్ పేరు లేదు. ఎన్నికల సంఘంలో మొత్తం 15 మందికి చోటు దక్కింది. ఇందులో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్‌లు కూడా ఉన్నారు. దీంతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కూడా చేర్చారు.



    పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వ్యవహరిస్తారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, బిఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, సుధా యాదవ్, సత్యనారయణ జాతియా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మాథుర్, బిఎల్ సంతోష్, వానతి శ్రీనివాస్‌ని చేర్చారు.

    Congress: తెలంగాణకు కాంగ్రెస్​ ఇన్​ఛార్జ్​గా ప్రియాంకా గాంధీ?.. మాణిక్కం ఠాగూర్​ రియాక్షన్​ ఇదే..

    CM KCR in Medchal: మోసపోతే మళ్లీ గోసపడతాం.. వాళ్ల మాటలు నమ్మొద్దన్న కేసీఆర్..

    లక్ష్మణ్‌కు కీలక పదవి
    అయితే తెలంగాణకు చెందిన లక్ష్మణ్‌ను అటు పార్లమెంటరీ బోర్డుతో పాటు పార్టీ ఎన్నికల కమిటీలోనూ చేర్చడం వెనుక బీజేపీ లక్ష్యం తెలంగాణలో అధికారం సాధించడమే అనే విషయం స్పష్టమవుతోంది. కొంతకాలంగా తెలంగాణలో పార్టీ బలపడుతున్న నేపథ్యంలో.. ఇక్కడి నేతలకు ప్రాధాన్యత ఉన్న పదవులు ఇవ్వడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే యూపీ నుంచి లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపింది. తాజాగా ఆయనను పార్టీలోని అత్యున్నత, ప్రాధాన్యత కలిగిన కమిటీల్లో చోటు కల్పించి.. తెలంగాణ రాష్ట్రం తమకు ఎంత ముఖ్యమైనదో మరోసారి క్లారిటీ ఇచ్చింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు