vijayashanthi | సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి (vijayashanthi) మరోసారి కేసీఆర్ సర్కార్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటేసిన పాపానికి సీఎం కేసీఆర్ మహిళలకు మరణశిక్ష వేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా..ఈరోజు నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి (vijayashanthi) ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ కు మందు మీద ఉన్న దృష్టి ఆడబిడ్డలకు న్యాయం చేసే విషయంలో లేదని ఆమె ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఎక్కడ అరెస్ట్ అవుతుందో అన్న భయం కేసీఆర్ కు పట్టుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నా పట్టించుకోని కేసీఆర్ లిక్కర్ స్కాంలో సిసోడియా అరెస్ట్ పై స్పందించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోని మహిళలకు ఏమి జరిగినా పట్టించుకోని కేసీఆర్ తన కూతురు కవిత విషయానికి వచ్చే వరకు ఆందోళన చెందుతున్నారని విజయశాంతి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని మహిళలకు కేసీఆర్ కు పట్టదు కానీ తన కూతురు ఎక్కడ అరెస్ట్ అవుతుందో అనే భయంతోనే సిసోడియా అరెస్టుపై స్పందించారన్నారు.
కాగా ఇటీవల తెలంగాణలో ఓ వైపు విద్యార్థుల ఆత్మహత్యలు..మరోవైపు మహిళలపై అత్యాచారాలు, హత్యలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో బండి సంజయ్ ఈ ఘటనలకు నిరసనగా..నేడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో దీక్షకు పూనుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయశాంతి సహా పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు పేర్కొంది. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi cm Kejriwal), వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది. ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో విజయశాంతి కవిత ప్రస్తావన తెస్తూ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, BRS, CM KCR, Kalvakuntla Kavitha, Telangana, Vijayashanthi