హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కర్ణాటకతోపాటే తెలంగాణకు ఎన్నికలు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

Telangana: కర్ణాటకతోపాటే తెలంగాణకు ఎన్నికలు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ మ్యాప్

తెలంగాణ మ్యాప్

Komatireddy Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని... షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కొద్దిరోజుల క్రితమే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ (Telangana )ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో స్పష్టం చేశారు. అయితే ఆ తరువాత కూడా ఈ ఊహాగానాలు ఆగడం లేదు. కేసీఆర్(KCR) ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ అంశంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. నేడు నిర్మల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగంతోనే విజయం సాధించిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, దీంతో సీఎం కేసీఆర్ భయపడుతున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు లేరని.. ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి నేతలు రావాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.

డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ సమావేశాల్లో కేంద్రం, బీజేపీ టార్గెట్‌గానే ముందుకు సాగనుందని తెలుస్తోంది. సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులను, ఇతర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుంటుందనే అంశంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇవ్వనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం సాయం చేయకున్నా..తెలంగాణ అభివృద్ధి ఎలా చేస్తామనే సంకేతాలు ఇవ్వనున్న కేసీఆర్.. ఇందుకోసం తాము ఏం చేస్తామనే విషయాలను కూడా అసెంబ్లీ వేదికగానే చెబుతారని సమాచారం.

Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి...

Breaking: వైఎస్‌ షర్మిలను అరెస్ట్ చేసిన నర్సంపేట పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

రాబోయే రెండు నెలల్లో తాము అనుకున్న పనులు, అభివృద్ధి పథకాలను మొదలుపెట్టి.. ఆ తరువాత ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో టీఆర్ఎస్ ఉందని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి ముందస్తు ఎన్నికలపై చర్చ జోరందుకుంది.

First published:

Tags: Komatireddy rajagopal reddy, Telangana

ఉత్తమ కథలు