హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP vs BRS: కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు..సమర్ధించిన డీకే అరుణ

BJP vs BRS: కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు..సమర్ధించిన డీకే అరుణ

aruna,kavitha, sanjay

aruna,kavitha, sanjay

BJP vs BRS: కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ . ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని వెనకేసుకొచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిపోతున్నాయి. ఈసమయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna)డి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్ధించారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని వెనకేసుకొచ్చారు డీకే అరుణ. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత(Kavitha)ను అరెస్ట్ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అనడం తెలంగాణలో వాడుకలో ఉన్న నానుడి అంటూ కవర్ చేసుకొచ్చారు.

అది వాడుక మాట..

అంతే కాదు కవిత లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు వస్తేనే బీఆర్ఎస్‌ నేతలు ఇంత రాద్ధాంతం చేయడం ఏమిటని విమర్శించారు డీకే అరుణ. గవర్నర్ తమిళిసైని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తిట్టినప్పుడు వీళ్లంతా ఏమయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ కుమార్తె ఒక్కతే ఆడబిడ్డ..మిగిలిన వాళ్లంతా ఆడబిడ్డలు కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ.

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై సమర్ధన..

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఈవిధంగా సమర్దించుకుంటుంటే.. బీఆర్ఎస్‌ మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసనలతో హోరెత్తిస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, బీఆర్ఎస్‌ కార్పొరేటర్లు రాజ్‌భవన్‌ ముంద ఆందోళన చేపట్టారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు..

సిద్దిపేట జిల్లాలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిజస్వరూపం ఏమిటో మహిళా ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు.

Delhi: కల్వకుంట్ల కవితను 9గంటలు విచారించిన ఈడీ ..మళ్లీ ఎప్పుడు రమ్మన్నారంటే

నిరసనల హోరు..

ఢిల్లీలో కూడా భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచితంగా మాట్లాడటంపై ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసారు. అక్కడ నిరసనలు చేపట్టారు.

First published:

Tags: Bandi sanjay, Kalvakuntla Kavitha, Telangana Politics