హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana BJP: రేపు తెలంగాణకు బీజేపీ ముఖ్యనేత.. అప్పుడే పని మొదలుపెట్టారా ?.. వాటిపైనే ఫోకస్

Telangana BJP: రేపు తెలంగాణకు బీజేపీ ముఖ్యనేత.. అప్పుడే పని మొదలుపెట్టారా ?.. వాటిపైనే ఫోకస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana BJP: బీజేపీ నాయకత్వం తెలంగాణలో తమ వ్యూహాలను అమలు చేయడం అప్పుడే మొదలుపెట్టిందని.. ఈ క్రమంలోనే ముందుగా నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు, విభేదాలను తొలగించే ప్రయత్నాలు చేస్తోందనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో మంచి విజయాలు సాధించి మంచి జోరు మీదున్న బీజేపీ.. తెలంగాణలో అధికారం దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తెలంగాణలో(Telangana) తాము అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన బీజేపీ(BJP) నాయకత్వం.. తమకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను ఏ మాత్రం వదులుకోవద్దని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే తెలంగాణలో పాగా వేసేందుకు అవసరమైన వ్యూహాలకు బీజేపీ నాయకత్వం పదును పెడుతోంది. ఇందులో భాగంగా అసలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం రాష్ట్రానికి వచ్చి వెళ్లిన కొందరు బీజేపీ ప్రతినిధులు.. రాష్ట్రంలోని నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు, విభేదాలపై పార్టీ నాయకత్వానికి ఓ రిపోర్టు ఇచ్చారట.

అధికారంలోకి రావాలనుకుంటున్న రాష్ట్రంలో ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ నాయకత్వం.. ముందుగా నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh)రంగంలోకి దిగబోతున్నారు. రేపు బీఎల్ సంతోష్ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన పార్టీ ఈ అంశాలపైనే దృష్టి పెట్టి పార్టీ నేతలతో చర్చించబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఎవరెవరు నేతలతో మాట్లాడతారు ? ఎవరెవరికి క్లాస్ తీసుకుంటున్నారనే అంశంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరోవైపు బీజేపీ నాయకత్వం తెలంగాణలో తమ వ్యూహాలను అమలు చేయడం అప్పుడే మొదలుపెట్టిందని.. ఈ క్రమంలోనే ముందుగా నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు, విభేదాలను తొలగించే ప్రయత్నాలు చేస్తోందనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆయన జిల్లా స్థాయి నేతలతో చర్చిస్తారా లేక రాష్ట్రస్థాయి నేతలతో చర్చలు జరుపుతారా ? అన్నది తెలియాల్సి ఉంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

CM KCR లెక్క తప్పిందా? -హ్యాండివ్వనున్న ప్రశాంత్ కిషోర్ -కాంగ్రెస్‌ గూటికి ఎన్నికల వ్యూహకర్త!

Yadadri : సాయంత్రం నుండే యాదాద్రికి భక్తులు.. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవం..

అయితే అంతకంటే ముందు ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల మధ్య విభేదాలను తొలగితేనే.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని నమ్ముతోంది. ముందుగా ఆ పని చేయకుండా ఏం చేసినా.. రాష్ట్రంలో పార్టీ బలపడటం, అధికార టీఆర్ఎస్‌తో పోరాటం కష్టమనే అంచనాకు వచ్చింది. పార్టీ జాతీయ నాయకత్వానికి సైతం ఇక్కడ పర్యటించిన కొందరు నేతలు ఇదే రకమైన నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా భావించిన ఆ పార్టీ జాతీయ నాయకత్వం.. ఇలాంటి విషయాలను డీల్ చేయడంలో మంచి అనుభవం ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న బీఎల్ సంతోష్‌ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Bjp, Telangana

ఉత్తమ కథలు